Government Schools: ప్రభుత్వ బడుల్లో జూలై 12 వరకు ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్
ABN , Publish Date - Jun 24 , 2025 | 06:16 AM
ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచడం లక్ష్యంగా ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ చేపట్టాలని సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు ఆదేశాలిచ్చారు.
అమరావతి, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచడం లక్ష్యంగా ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ చేపట్టాలని సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు ఆదేశాలిచ్చారు. విద్యార్థుల సంఖ్య పెంచడంతోపాటు బడి మానేసిన పిల్లలను తిరిగి చేర్పించాలన్నారు. ఇందుకోసం ఇంటింటి సర్వే చేపట్టాలని, జూలై 12 వరకు డ్రైవ్ కొనసాగాలని ఆదేశించారు. వంద శాతం బడి ఈడు పిల్లలు పాఠశాలల్లో ఉండటం, 6-14 ఏళ్ల పిల్లలను కచ్చితంగా బడుల్లో చేర్చడం ఈ డ్రైవ్ లక్ష్యాలుగా పేర్కొన్నారు. డ్రైవ్‌లో భాగంగా అన్ని పాఠశాలల్లో ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఏపీటీఎ్‌ఫ-అమరావతి అధ్యక్షుడు సీవీ ప్రసాద్ కోరారు.