Share News

Vizag Steel Plant: ఆర్థిక సాయమంతా అప్పులు తీర్చడానికే!

ABN , Publish Date - Jan 30 , 2025 | 05:08 AM

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కేంద్రం రూ.1,650కోట్ల ఆర్థిక సాయం అందించింది. ఆ మొత్తాన్ని బ్యాంకుల అప్పులు తీర్చడానికే ఉపయోగించారు. ఆ తర్వాత కేంద్రం రూ.11,440 కోట్లు ఆర్థిక ప్యాకేజీ ప్రక టించింది. దీనిని ఎలా ఉపయోగిస్తారనే అంశంపై ఉద్యోగ వర్గాల్లో సం దేహాలున్నాయి.

Vizag Steel Plant: ఆర్థిక సాయమంతా అప్పులు తీర్చడానికే!

జీతాల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు

స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులిచ్చే పరిస్థితి లేదు

స్టీల్‌ కార్యదర్శి సందీప్‌ పాండ్రీ స్పష్టీకరణ

విశాఖపట్నం, జనవరి 29(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు సమస్యకు ఓవైపు పరిష్కారం చూపిస్తూనే మరోవైపు పీటముడి వేస్తు న్నారు. ఉద్యోగులను అయోమయంలోకి నెడుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కేంద్రం రూ.1,650కోట్ల ఆర్థిక సాయం అందించింది. ఆ మొత్తాన్ని బ్యాంకుల అప్పులు తీర్చడానికే ఉపయోగించారు. ఆ తర్వాత కేంద్రం రూ.11,440 కోట్లు ఆర్థిక ప్యాకేజీ ప్రక టించింది. దీనిని ఎలా ఉపయోగిస్తారనే అంశంపై ఉద్యోగ వర్గాల్లో సం దేహాలున్నాయి. ఆగస్టులో ప్రారంభిస్తామని ప్రకటించిన బ్లాస్‌ ఫర్నేస్‌-3 కోసం అవసరమైన ముడిపదార్థాలను ఇప్పుడే కొనేయడానికి ఉన్న తాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి బీజేపీలో కొందరు నేతలు సహకరిస్తున్నారు. రూ.కోట్లల్లో వచ్చే కమీషన్లకు ఆశపడి కొందరు ఉన్నత స్థాయిలో చేస్తున్న అవినీతి ఇది.

ఢిల్లీ నుంచి విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు వచ్చిన ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్‌ పాండ్రీ బుధవారం ప్లాంటులో ఎంపిక చేసిన 250 మంది యువ ఎగ్జిక్యూటివ్‌ అధికారులతో సమావేశమయ్యారు. ఉద్యోగ వర్గాల నుంచి సేకరించిన సమాచారం మేరకు ఆయన స్పష్టత ఇచ్చిన అంశాలివీ.. కేంద్రం ప్రకటించిన రూ.11,440 కోట్లు ప్యాకేజీని బ్యాంకుల రుణాలు, అప్పులు తీర్చడానికే ఉపయోగిస్తారు. గతంలో ఇచ్చిన రూ.1,650 కోట్లు కూడా ఈ ప్యాకేజీలో భాగమే. ఫర్నేసులను నడపాల్సిన బాధ్యత ఉద్యోగులదే. జీతాలు, బకాయిలు, ఇంక్రిమెంట్లలో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. ప్లాంటుకు సొంత గనులు కేటాయించే పరిస్థితి లేదు. సెయిల్‌లో విలీనం కుదరదు. ప్లాంటు ప్రైవేటీకరణ అంశం పార్లమెంటులో ఉంది. అక్కడ నిర్ణయం తీసుకోవాలి. ప్లాంటును లాభా ల్లోకి తీసుకురావడం అనేది ఉద్యోగులు, కార్మికుల బాధ్యత. అని పేర్కొన్నట్టు తెలిసింది.

Updated Date - Jan 30 , 2025 | 05:08 AM