Nimmala Ramanaidu: కాలువల మరమ్మతులకు రూ. 344 కోట్లు
ABN , Publish Date - May 14 , 2025 | 05:06 AM
వర్షాకాలానికి ముందు సాగునీటి కాలువల మరమ్మతులకు రూ.344 కోట్లు కేటాయించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నష్టపోయిన సాగునీటి రంగాన్ని తిరిగి పునరుద్ధరిస్తున్నామని పేర్కొన్నారు.
అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): సాగునీటి కాలువల మరమ్మతు పనుల కోసం రూ.344 కోట్లను వ్యయం చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ‘వర్షాకాలంలోగా సాగునీటి కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క, తూడు, పూడికతీత పనులు చేపడుతున్నాం. 2019-24 మధ్య కాలంలో జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వంలో సాగునీటి రంగాన్ని పూర్తిగా నాశనం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత జూన్‌లో రూ.90 కోట్లతో, సెప్టెంబరులో రూ.326 కోట్లతో అత్యవసర పనులు చేపట్టాం. సాగునీటి రంగాన్ని గాడిలో పెడుతున్నాం. రూ.10 లక్షలలోపు పనులను సాగునీటి సంఘాల సమాఖ్య ద్వారా, రూ.10 లక్షలకు పైబడ్డ పనులను స్వల్పకాలిక టెండర్లను పిలిచి పూర్తి చేయాలని నిర్ణయించాం. ఈ నెలాఖరులోగా టెండర్లను ఖరారు చేసి ఆగస్టు నాటికి నిర్దేశిత పనులు పూర్తి చేస్తాం’ అని చెప్పారు
ఈ వార్తలు కూడా చదవండి..
Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్
CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..