Share News

Forest Department: తిరుమల ఘాట్‌లో ఏనుగుల గుంపు

ABN , Publish Date - Jul 04 , 2025 | 05:25 AM

తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో గురువారం రాత్రి ఏనుగుల గుంపు సంచారం కలకలం సృష్టించింది. పిల్ల ఏనుగులతో పాటు మొత్తం ఏడు ఏనుగులు గురువారం రాత్రి 9 గంటల సమయంలో...

 Forest Department: తిరుమల ఘాట్‌లో ఏనుగుల గుంపు

తిరుమల, జూలై 3(ఆంధ్రజ్యోతి): తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో గురువారం రాత్రి ఏనుగుల గుంపు సంచారం కలకలం సృష్టించింది. పిల్ల ఏనుగులతో పాటు మొత్తం ఏడు ఏనుగులు గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఏనుగుల ఆర్చ్‌ వద్దనున్న రోడ్డు సమీపానికి వచ్చాయి. దీంతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది అక్కడికి చేరుకుని టార్చ్‌లైట్లు వేస్తూ సైరన్లు మోగించడంతో ఏనుగుల గుంపు తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది. అనంతరం ఫారెస్ట్‌, విజిలెన్స్‌ సిబ్బంది వాహనదారులను అప్రమత్తం చేసి పంపారు.

Updated Date - Jul 04 , 2025 | 05:26 AM