ఉత్తమ ఎన్నికల విధులకు.. పురస్కారం
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:54 AM
ఓటర్ల జాబితా నవీక రణ విధుల్లో అత్యుత్తమ సేవలం దించిన జిల్లాకు చెందిన ఒక తహసీ ల్దార్ తో పాటు ఇద్దరు బీఎల్‌వో (బూత్ లెవెల్ ఆఫీసర్)లు బెస్ట్ ఎలకో్ట్రరల్ అవార్డులకు ఎంపికయ్యారు.

జిల్లా నుంచి బెస్ట్ ఎలకో్ట్రరల్ అవార్డుకు తహసీల్దార్, ఇద్దరు బీఎల్‌వోలు ఎంపిక
ఏలూరు అర్బన్/కొయ్యలగూడెం, జన వరి 24 (ఆంధ్రజ్యోతి) : ఓటర్ల జాబితా నవీక రణ విధుల్లో అత్యుత్తమ సేవలం దించిన జిల్లాకు చెందిన ఒక తహసీ ల్దార్ తో పాటు ఇద్దరు బీఎల్‌వో (బూత్ లెవెల్ ఆఫీసర్)లు బెస్ట్ ఎలకో్ట్రరల్ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ మేరకు అధికారిక సమాచారాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం విడుదల చేసింది. ఈ మేరకు కొయ్యలగూడెం తహసీల్దార్ కె.చెల్లన్న బెస్ట్ ఎలకో్ట్రరల్ అవార్డుకు ఎంపికయ్యారు. అవార్డు తన బాధ్యతలను మరింత పెంచింద న్నారు. కాగా ఏలూరు కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మార్సీ కాలనీ–2 సచివాలయంలో వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్ర టరీగా పని చేస్తున్న ఎస్కే.నాగూర్‌వలి (కామ వరపుకోట) నగరంలోని కట్టా సుబ్బా రావుతోట పోలింగ్ స్టేషన్ నెంబరు 57లో బీఎల్‌వోగా విధులు నిర్వర్తిస్తు న్నారు. పోలవరం అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో గెడ్డపల్లి పంచాయతీ పోలింగ్ స్టేషన్ నెంబరు 245లో బీఎల్‌వోగా ఎస్.భవాని విధులు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల విధుల నిర్వ హణలో అత్యుత్తమ సేవలందించినందు కు ఈ ముగ్గురికి జిల్లాలో పురస్కారాలు లభించాయి. జాతీయ ఓటర్ల దినోత్సవా న్ని పురస్క రించుకుని శనివారం విజ యవాడ తుమ్మల పల్లి కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డులను అందజేయనున్నారు.
నేడు జాతీయ ఓటర్ల దినోత్సవానికి సర్వం సిద్ధం
ఏలూరు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఓటర్లలో చైతన్యం నింపేందుకు శనివారం పోలింగ్ బూత్‌లు, మండల, జిల్లా స్థాయిలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నాహాలు పూర్తి చేసింది. ఏలూరులోని ఇండోర్ స్టేడియం నుంచి ఫైర్‌స్టేషన్, డీఈవో కార్యాలయం మీదుగా ఇండోర్ స్టేడియం వరకు ఇంటర్, టెన్త్ విద్యార్థులతో 2కే రన్, మానహారం నిర్వహించనున్నారు. ఓటర్లను చైతన్యం చేస్తూ ముద్రించిన టీ షర్టులను ప్రతీ నియోజక వర్గంలో యువత ధరించి ప్రదర్శనల్లో పాల్గొననున్నారు. ఏటా జనవరి 25న జాతీయ ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం జరుగుతుంది. కలెక్టరేట్‌లో జాతీయ ఓటర్ల దినోత్సవ సభను ఉదయం 10 గంటలకు కలెక్టర్ వెట్రిసెల్వి ఆధ్వర్యంలో నిర్వహించనున్నా రు. వివిధ కేటగిరుల్లో విజేతలకు సర్టిఫికెట్ల ప్రదానంతో పాటు, ఓటర్ల చైతన్యవంతులను చేసిన, సీనియర్ సిటిజన్లను సత్కరిస్తారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని అధికారులు విజయవంతం చేయా లని కలెక్టర్ వెట్రిసెల్వి ఒక ప్రకటనలో కోరారు. కాగా జిల్లాలో సవరించిన ఓటర్ల ముసాయిదా జాబితాను ఈనెల ఆరో తేదీన ప్రకటించారు. ఇందులో మొత్తం ఓటర్లు 16,38,436 కాగా పురుష ఓటర్లు 7,99,781 మంది, మహిళా ఓటర్లు 8,38,531 మంది ఉన్నారు.