Share News

ఉద్యోగ, ఉపాధి కల్పనకు కృషి

ABN , Publish Date - Jan 16 , 2025 | 12:18 AM

జిల్లాలోని యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు కృషి చేస్తానని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.

   ఉద్యోగ, ఉపాధి కల్పనకు కృషి
ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేస్తున్న మంత్రి టీజీ భరత

ముగ్గుల పోటీల నిర్వహణ అభినందనీయం

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత

కర్నూలు కల్చరల్‌, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు కృషి చేస్తానని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. డీవీఆర్‌, టీజీవీ గ్రూప్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు బుధవారం రాత్రి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి టీజీ భరత మాట్లాడుతూ ముగ్గుల పోటల్లో ప్రతిభ ఆధారంగా విజేతలను ఎంపిక చేశారన్నారు. సంప్రదాయాన్ని గుర్తు చేసేలా ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. జిల్లాకు రూ.14వేల కోట్ల పెట్టుబడులతో సెమికండక్టర్‌ పరిశ్రమను ఓర్వకల్లు ఇండసి్ట్రయల్‌ హబ్‌ తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. సరైన సమయంలో రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని, ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల వ్యవధిలోనే లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు కృషి చేశామని చెప్పారు. ఐదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ది చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముందుకెళ్తున్నామన్నారు. 2025 సంవత్సరం కూడా ప్రజలందరికీ ఎంతో మంచి జరుగుతుందని ఆకాంక్షించారు. డీవీఆర్‌ గ్రూప్స్‌ చైర్మన డి.వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ పోటీలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు, కన్సోలేషన బహుమతులను మంత్రి టీజీ భరత, డీవీఆర్‌ గ్రూప్స్‌ చైర్మన డి.వెంకటేశ్వరరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్‌ ఫేమ్‌, యాంకర్‌ రష్మిగౌతమి, యాంకర్‌ దీప్తి నల్లమోతు హాజరయ్యారు. జబర్దస్త్‌ కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Updated Date - Jan 16 , 2025 | 12:18 AM