Education Department: ఆ పిల్లలకు నగదు విడుదల చేయలేదు
ABN , Publish Date - Jun 16 , 2025 | 05:05 AM
తల్లికి వందనం పథకంపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా వార్తా కథనాలను ప్రచురించిన పత్రిక, ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా హ్యాండిల్స్ బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది.

తప్పుదోవ పట్టించే కథనాలపై చర్యలు
పాఠశాల విద్యాశాఖ హెచ్చరిక
అమరావతి, జూన్ 15(ఆంధ్రజ్యోతి): తల్లికి వందనం పథకంపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా వార్తా కథనాలను ప్రచురించిన పత్రిక, ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా హ్యాండిల్స్ బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది. జగన్ పత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనాన్ని ప్రస్తావిస్తూ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కర్నూలు జిల్లాలో భారీ సంఖ్యలో పిల్లలున్న కుటుంబాలకు నగదు జమ చేసినట్టు జగన్ పత్రిక పేర్కొందని, అయితే, అలాంటి వారికి నగదు విడుదల చేయలేదని తెలిపింది. ఆరుగురు పిల్లలు దాటిన తల్లుల వివరాలను డీఈవో, ఎంఈవో స్థాయిలో పరిశీలిస్తున్నామని వివరించింది.