Share News

స్నేహితుడికి గుర్తుగా...

ABN , Publish Date - Dec 20 , 2025 | 12:49 AM

యానాం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఆం ధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గుర్తుగా యానాం యార్రగార్డెన్స్‌లో స్మృతి మందిరం ఏర్పాటు చేశారు. పుదు

స్నేహితుడికి గుర్తుగా...
వైఎస్‌ఆర్‌ స్మృతి మందిరం

రేపు యానాంలో వైఎస్‌ఆర్‌ స్మృతి మందిరం ప్రారంభం

యానాం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఆం ధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గుర్తుగా యానాం యార్రగార్డెన్స్‌లో స్మృతి మందిరం ఏర్పాటు చేశారు. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, వైఎస్‌ ఆర్‌కు ఉన్న స్నేహానికి గుర్తుగా ఈ మందిర నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా విలేకర్లతో మల్లాడి మాట్లాడుతూ తాను రాజకీయాల్లో ప్రవేశించి ఈనెల 21కి 36 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా... వైఎస్‌ఆర్‌ యానాం ప్రజలకు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆయన పేరుతో నూతనం గా స్మృతిమందిరం, గోశాల నిలయాన్ని 21న ప్రారంభి ంచడం జరగుతుందన్నా రు. ముఖ్యమైన అంశాలతో అత్మీయులతో రాజన్న స్మృ తితో అనే పుస్తకాన్ని ఆవి ష్కరిస్తామన్నారు. అనేక అ ంశాల్లో యానానికి వైఎస్‌ ఆర్‌ ఎంతో మేలు చేశార ని.. ముఖ్యంగా తాను కాంగ్రెస్‌లో చేరడం నుంచి మంత్రి పదవి ఇప్పించడంతో పూర్తి సహకారం అందించారని తెలిపారు. వైఎస్‌ఆర్‌తో ఉన్న ఆ నాటి మంత్రులు, మిత్రులు, కుటుంబసభ్యులను ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించా మన్నారు. కులమతాలు,రాజకీయాలకతీతంగా అందరూ తరలివ్చి జయప్రదం చేయాలన్నారు.

Updated Date - Dec 20 , 2025 | 12:49 AM