Share News

యానాంలో వైఎస్‌ఆర్‌ స్మృతి మందిరం ప్రారంభం

ABN , Publish Date - Dec 22 , 2025 | 01:38 AM

యానాం, డిసెంబరు 21 (ఆంధ్ర జ్యోతి): ప్రజలతో భాగస్వామ్యం అయినప్పుడే ప్రజాప్రతినిధిగా మరింత ఎక్కువ సేవకు అవకాశం ఉంటుందని వైఎస్‌ఆర్‌కు అత్యంత సన్నిహితుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు అన్నారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కృతజ్ఞతగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్ర

యానాంలో వైఎస్‌ఆర్‌ స్మృతి మందిరం ప్రారంభం
వైఎస్‌ఆర్‌ స్మృతి మందిరంలో విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న నేతలు

హాజరైన ప్రముఖులు

యానాం, డిసెంబరు 21 (ఆంధ్ర జ్యోతి): ప్రజలతో భాగస్వామ్యం అయినప్పుడే ప్రజాప్రతినిధిగా మరింత ఎక్కువ సేవకు అవకాశం ఉంటుందని వైఎస్‌ఆర్‌కు అత్యంత సన్నిహితుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు అన్నారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కృతజ్ఞతగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సొంతనిధులతో నిర్మించిన వైఎస్‌ఆర్‌ స్మృతి మందిరం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన రామచంద్రరావు మందిరంలోని వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వైఎస్‌ఆర్‌ సన్నిహితులు, స్నేహితులు విజయసాయిరెడ్డి, రాఘువీరరెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్‌, గిడుగు రుద్రరాజు, చిన్నరెడ్డి, పిల్లి సుభాస్‌ చంద్రబోస్‌, కోనతాల రామకృష్ణా, పంతం నానాజీ, కుడిపూడి సూర్యనారాయణ, కృష్ణార్జున చౌదరి, రాధకృష్ణ చౌదరి, సత్తి సుర్యనారాయణ, అనాటి వైఎస్‌ఆర్‌ అంగరక్షకుడు సూరిడు హాజరయ్యారు. కెవిపి మాట్లాడుతు వైఎస్‌ఆర్‌తో అనేక అనుభందం ఉన్న తాము సిగ్గుపడేలా, అందరూ గర్వపడేలా మ ల్లాడి కార్యక్రమం నిర్వహించరన్నా రు. వైఎస్‌ఆర్‌ను ఈ విధంగా ఇప్పటివకు ఎవ్వరు చూపలేదని మల్లాడికి వైఎస్‌ఆర్‌తో ఉన్న అనుభందం దీని ద్వారా తెలుస్తుంన్నారు. మల్లాడిని ఘనంగా సత్కరించారు. వైఎస్‌ఆర్‌తో తనకు ఉన్న అనుబంధంతో పలు ముఖ్యమైన అంశాలతో మల్లాడి ప్రచురించిన రాజన్న స్మృతితో అనే పుస్తకాన్ని నేతలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో వివిధ సంఘల నాయకులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2025 | 01:38 AM