అరగుండు చేయించుకున్న జగన్ అభిమాని
ABN , Publish Date - May 30 , 2025 | 11:50 PM
చాగల్లు, మే 30(ఆంధ్రజ్యోతి): స్నేహితులకు ఇచ్చిన మాట ప్రకారం జగన్ ఓటమి చెందినం దుకు ఆయన అభిమాని అరగుండు చేయించు కున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజ కవర్గం చాగల్లు మండలంలో ఈనెల 25న ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి గ్రామ స్తులు తెలిపిన వివరాలివి. చాగల్లు మండలం ఊనగట్లకు చెందిన వీరవల్లి శివ వైసీపీ కొవ్వూ రు నియోజకవర్గం సోషల్ మీడియా కో కన్వీనర్‌గా వ్య వహ
తూర్పుగోదావరి జిల్లా ఊనగట్లలో ఘటన
ఆలస్యంగా వెలుగులోకి
చాగల్లు, మే 30(ఆంధ్రజ్యోతి): స్నేహితులకు ఇచ్చిన మాట ప్రకారం జగన్ ఓటమి చెందినం దుకు ఆయన అభిమాని అరగుండు చేయించు కున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజ కవర్గం చాగల్లు మండలంలో ఈనెల 25న ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి గ్రామ స్తులు తెలిపిన వివరాలివి. చాగల్లు మండలం ఊనగట్లకు చెందిన వీరవల్లి శివ వైసీపీ కొవ్వూ రు నియోజకవర్గం సోషల్ మీడియా కో కన్వీనర్‌గా వ్య వహ రించేవాడు. ఎన్నికల సమయంలో వైసీపీ గెలుపు ఖాయమని చాలా ధీమా వ్యక్తం చేశాడు. జగన్ ఓడిపోతే అరగుండు చేయించుకుంటానని పందెం కాశా డు. దీంతో జగన్ ఓటమి చెంది సంవత్సరం పూ ర్తవుతున్న సందర్భంగా ఈనెల 25న ఆదివారం సాయంత్రం అతడు అరగుండు చేయించుకుని ఊనగట్ల సెంటర్‌లో కొద్దిసేపు తిరిగాడు. కాగా ఈ విషయం బయటకు పొక్కలేదు. శుక్రవారం ఈ విషయం తెలియడంతో ఆంధ్రజ్యోతి అతడిని పలకరించింది. ముఖ్యమంత్రిగా జగన్ అమలు చేసిన పథకాలు ఆయనను గెలిపిస్తాయని నమ్మానని, కానీ ప్రజలు వైసీపీని తిరస్కరించా రని, జగన్ ఓడిపోవడంతో స్నేహితులకు ఇచ్చిన మాట కోసం అరగుండు చేయించుకున్నానని వీరవల్లి శివ బదులిచ్చాడు.