Share News

పర్యాటకానికి వచ్చి.. ప్రమాదంలో చిక్కి..

ABN , Publish Date - Jun 08 , 2025 | 12:02 AM

మోతుగూడెం, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): పర్యాటక ప్రాంతాల సందర్శనకు వచ్చిన యువకులు ప్రమాదంలో చిక్కుకున్న సంఘటన అ ల్లూరి జిల్లా మోతుగూడెం పరిధిలోని ధా రాలమ్మ పిక్ని క్‌ స్పాట్‌ వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామానికి చెం దిన 20 మంది తాపీ పని చేసే వ్యక్తులు శనివారం ఉదయం చింతూరు మండలం మోతుగూడెం పర్యాటక ప్రాంతాల సందర్శనకు రెండు టాటా మ్యాజిక్‌ వాహనాలపై వచ్చారు. మోతుగూడెం ధారాలమ్మ పిక్నిక్‌ స్పాట్‌ వద్ద సీలేరు నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో నది మధ్యలోకి ఐదుగురు యువకులు వెళ్లి స్నానా నికి దిగారు.

పర్యాటకానికి వచ్చి.. ప్రమాదంలో చిక్కి..
నదిలో చిక్కుకున్నవారిని తాళ్ల సాయంతో బయటకు తీసుకొస్తున్న దృశ్యం

సీలేరు నదిలో నలుగురు యువకులను

కాపాడిన పోలీసులు, జెన్‌కో ఉద్యోగులు

మరో యువకుడి గల్లంతు

మోతుగూడెం, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): పర్యాటక ప్రాంతాల సందర్శనకు వచ్చిన యువకులు ప్రమాదంలో చిక్కుకున్న సంఘటన అ ల్లూరి జిల్లా మోతుగూడెం పరిధిలోని ధా రాలమ్మ పిక్ని క్‌ స్పాట్‌ వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామానికి చెం దిన 20 మంది తాపీ పని చేసే వ్యక్తులు శనివారం ఉదయం చింతూరు మండలం మోతుగూడెం పర్యాటక ప్రాంతాల సందర్శనకు రెండు టాటా మ్యాజిక్‌ వాహనాలపై వచ్చారు. మోతుగూడెం ధారాలమ్మ పిక్నిక్‌ స్పాట్‌ వద్ద సీలేరు నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో నది మధ్యలోకి ఐదుగురు యువకులు వెళ్లి స్నానా నికి దిగారు. అదే సమయంలో పొల్లూరు జల విద్యుత్‌కేంద్రంలో జెన్‌కో ఉన్నతాధికారులు విద్యుదుత్పత్తిని ప్రారంభించటంతో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిపోయింది. దీంతో యువకులు రాళ్లపైకి చేరి రక్షించడం అంటూ ఆర్తనాదాలు చేశారు. సమాచారం తెలుసుకున్న జెన్‌కో ఉన్నతాధికారులు ఒంటిగంట సమయంలో జనరేషన్‌ నిలిపివేశారు. ఎస్‌ఐ ఎస్‌కే సాధిక్‌, ఎంపీటీసీ వేగి నాగేశ్వనరరావు, గజ ఈతగాళ్లు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు, జెన్‌కో ఉద్యోగులు, గుత్తేదారు కార్మికులు, స్థానిక యువకులు నది ప్రవాహం మధ్యలో చిక్కుకుపోయిన పి.సుధీర్‌, కె.నాగేంద్ర, సి.రామకృష్ణ, బి.ప్రభులను తాళ్ల సాయంతో సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చి కాపాడారు. అభిలాష్‌ (18) అనే యువకుడు గల్లంతయ్యాడు. ఆ యువకుడి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - Jun 08 , 2025 | 12:02 AM