అర్ధరాత్రి హల్‌చల్...
ABN , Publish Date - Sep 09 , 2025 | 01:00 AM
రాజమహేంద్రవరం, సెప్టెం బరు 8 (ఆంధ్రజ్యోతి): జనాన్ని ర క్షించే పోలీసులకు రక్షణ లేకుండా పోయింది. అందుకు నిదర్శనం ఈ సంఘటనే. మత్తులో యువకులు పోలీసులపై దాడి చేశారు. అసలేం జరిగిందంటే.. తూర్పుగోదావరి జిల్లా రాజ మహేంద్రవరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న
మత్తులో పోలీసులపై యువకుల దాడి
రాజమహేంద్రవరంలో ఘటన
రాజమహేంద్రవరం, సెప్టెం బరు 8 (ఆంధ్రజ్యోతి): జనాన్ని ర క్షించే పోలీసులకు రక్షణ లేకుండా పోయింది. అందుకు నిదర్శనం ఈ సంఘటనే. మత్తులో యువకులు పోలీసులపై దాడి చేశారు. అసలేం జరిగిందంటే.. తూర్పుగోదావరి జిల్లా రాజ మహేంద్రవరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ యు.నాగ రాజు, హోంగార్డు కేకేకేఎస్‌వీ ప్రసాద్ (కాళి) ఆదివారం రాత్రి నైట్‌బీట్ పహారాలో ఉన్నారు. రాత్రి 12గంటల సమయంలో కోటిపల్లి బస్టాండ్ సమీపంలోని సోనోవిజన్ సందులోకి వెళ్లగా.. అక్కడ ఓ చోట ముగ్గురు యువకులు పూటుగా తాగిన మత్తులో కనిపించారు. వాళ్లలో ఒక యువకుడు బీర్ తాగుతున్నాడు. దీంతో ఎవరు మీరు? ఇక్కడ ఈ టైంలో ఉండకూడదు? తా గేసి ఉన్నారు కదా? ఇళ్లకు వెళ్లిపోండి.. అని పో లీసులు అన్నారు. దీంతో ఆ యువకులు పోలీ సులపై తిరగబడ్డారు. సుమారు 20 నిమిషాల పాటు కేకలు వేస్తూ, చేతులు విసు రుతూ గలాటా సృష్టించారు. కాని స్టేబుల్ లాఠీని లాక్కున్ని కొట్టా రు. యువకుల్లో ఒకడు తాను తాగే బీర్ బాటిల్‌తో తలపై కొట్టుకున్నాడు. చివరికి వాళ్ల ను అతికష్టంపై స్టేషన్‌కు తీ సుకెళ్లారు. వాళ్లను పాత తుంగపాడుకు చెందిన కట్టుంగ హరీశ్, రాజవోలుకు చెందిన కర్రి దుర్గా సూర్య ప్రసన్న, ధవళేశ్వరం ఐవోసీఎల్ కాలనీకి చెందిన ములపర్తి వినోద్‌గా గుర్తించి కేసు నమోదు చేశారు. హరీశ్‌పై రాజా నగరం పోలీస్ స్టేషన్లో రౌడీ షీటు ఉంది. హత్య, హత్యాయత్నం నేరాల్లో నిందితుడిగా ఉన్నాడు. అయితే వారు గంజాయి పూటుగా తాగిన మ త్తులో పోలీసులపై దాడికి దిగారని తెలుస్తోంది.