పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టరనే ఆందోళనతో..
ABN , Publish Date - Aug 27 , 2025 | 01:07 AM
సీతానగరం, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం సింగవరం గ్రామానికి చెందిన బిట్ర సూరిబాబు (24) కలుపు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల ప్రకారం.. సూరిబా బు రాజమహేంద్రవరం ఆసుపత్రిలో వరి బీజం ఆపరేషన్ చేయించుకున్నాడు. అప్పటి నుంచి ఆందోళన
యువకుడి ఆత్మహత్య
కలుపుమందు తాగిన వైనం
సీతానగరం, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం సింగవరం గ్రామానికి చెందిన బిట్ర సూరిబాబు (24) కలుపు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల ప్రకారం.. సూరిబా బు రాజమహేంద్రవరం ఆసుపత్రిలో వరి బీజం ఆపరేషన్ చేయించుకున్నాడు. అప్పటి నుంచి ఆందోళనగా ఉంటున్నాడు. ఆ ఆపరేషన్ వల్ల పెళ్లి చేసుకుంటే పిల్ల లు పుట్టరనే ఆందోళనతో మానసిక వేదనకు గురై సోమవారం సాయంత్రం గ్రామంలోని పామాయిల్‌తోటలోకి వెళ్లి కలుపుమందు తాగాడు. ఆత్మహత్య చేసుకుంటున్నానని, కలుపుమందు తాగేశానని కోట సతీష్ అనే వ్యక్తికి చెప్పగా అతడు ఉప్పల దుర్గాప్రసాద్‌కు చెప్పాడు. అత డు విషయాన్ని సూరిబాబు కుటుంబ సభ్యులకు చేరవేశాడు. దీంతో బంధువులు, స్నేహితులు పామాయిల్ తోటకు వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న సూరిబాబును సీతానగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందు తూ మంగళవారం ఉదయం మృతిచెందాడు. ఈ మేరకు సూరిబాబు తండ్రి బిట్ర శ్రీను పోలీసులకు ఫిర్యాదు చే శాడు. పోస్టుమార్టం చేయించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ డి.రామ్‌కుమార్ తెలిపారు.