వయసు 33.. కేసులు 69
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:48 AM
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): చిన్న వయసు నుంచే చోరీల బాట పట్టాడు. ఆ సొమ్ముతో విలాసాలకు అలవాటు పడ్డాడు. ఎన్ని సార్లు జైలుకు వెళ్లొచ్చినా మార్పు రాలేదు. దొంగతనం చేయడం.. పట్టుబడితే జైలుకు వెళ్లడం.. తిరిగి రావడంతోనే మళ్లీ చోరీలు చేయ డం.. ఇదే అతడికి దైనందిన జీవనంగా మారి పోయింది. దీంతో 33ఏళ్లకే 69 కేసులు నమోద య్యాయి. ఉండ్రాజవరానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన తూర్పు గోదావరి

16 ఏళ్ల నుంచే చోరీలు
అంతర్ జిల్లా దొంగ ఆట కట్టించిన తూర్పు గోదావరి జిల్లా పోలీసులు
630 గ్రాముల బంగారు, 4కిలోల వెండి,
సుమారు రూ.లక్ష నగదు స్వాధీనం
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): చిన్న వయసు నుంచే చోరీల బాట పట్టాడు. ఆ సొమ్ముతో విలాసాలకు అలవాటు పడ్డాడు. ఎన్ని సార్లు జైలుకు వెళ్లొచ్చినా మార్పు రాలేదు. దొంగతనం చేయడం.. పట్టుబడితే జైలుకు వెళ్లడం.. తిరిగి రావడంతోనే మళ్లీ చోరీలు చేయ డం.. ఇదే అతడికి దైనందిన జీవనంగా మారి పోయింది. దీంతో 33ఏళ్లకే 69 కేసులు నమోద య్యాయి. ఉండ్రాజవరానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన తూర్పు గోదావరి జిల్లా, నిడదవోలు పోలీసులు ఆ దొంగ ఆట కట్టించారు. ఈ మేరకు ఎస్పీ నరసింహ కిషోర్ వివరాలను వెల్లడించారు. భీమవరం టౌన్ పరిధిలోని గునుపూడికి చెందిన పందిరి వెంకట నారాయణ ప్రస్తుతం ఏలేశ్వరంలో ఉంటూ ఒక మహిళతో సహజీవనం చేస్తున్నాడు. తల్లిద ండ్రులు కూలీలుగా జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. అన్నయ్య ఆటో డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషిం చుకుంటున్నాడు. నారాయణ మాత్రం చిన్న తనం నుంచే విలాసాలకు అలవాటుపడి సొ మ్ముల కోసం దొంగతనాల బాట పట్టాడు. తన కు 16ఏళ్ల వయసు ఉండగా 2008లో భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇనుప ముక్కలు, సైకి ళ్లు దొంగతనం చేస్తూ మొదటిసారి పోలీసులకు పట్టుబడి జువైనల్ హోంకు వెళ్లొచ్చాడు. తర్వాత అవనిగడ్డకు చెందిన ఎలమంచిలి కృష్ణతో పరిచ యం ఏర్పడింది. ఇద్దరూ దొంగతనాలు చేయ డం ప్రారంభించారు. భీమవరం పోలీసులు ప ట్టుకుని మళ్లీ జువైనల్ హోంకి తరలించారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత 2014 నుంచి ఇళ్లలో దొంగతనాలు చేయడం ప్రారం భించాడు. జైలులో పరిచయం అయిన హైదరా బాద్‌కు చెందిన మంచం శ్రీనివాస్‌తో కలిసి అమలాపురం, పి.గ్నవరం, వీరవాసరం, ఆచంట, ఇరగవరం, పెనుగొండ, పెనుమంట్ర పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేశాడు. దొంగత నాలు చేయడం కోసం ప్రత్యేకంగా ఇనుప రాడ్‌లను తయారు చేయించుకున్నాడు. గతేడా ది అక్టోబరు 22న ఆలమూరు పోలీసులు జైలు కు పంపారు. నవంబరు 23న జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈ నాలుగు నెలల్లో ఉండ్రాజవరంలో 3, సమిశ్రగూడెం 3, పెనుమంట్ర 2, అయినవిల్లి, పెరవలి, రావుల పాలెం, భీమడోలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఒక్కో టి చొప్పున 12 ఇళ్లను దోచేశాడు. ఈ క్రమంలో గత నెల 11న ఉండ్రాజవరానికి చెందిన సీపాని విజయలక్ష్మీ తన ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో నారాయణను నిందితుడిగా గుర్తించి ఈ నెల 8న ఉండ్రాజవరంలో అరెస్టు చేశారు. ఇతడిపై ఇటీవల నమోదైన 12 కేసుల్లో 630గ్రాముల బంగారు ఆభరణాలు, 4కిలోల వెండి వస్తువులు, సుమారు రూ.1లక్ష నగదు, టీవీ, మోటార్ సైకి ల్, నేరానికి ఉపయోగించే స్ర్కూడ్రైవర్లు, ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరిం చారు. చోరీ సొత్తును ముత్తూట్ వంటి ఫైనాన్స్ కంపెనీల్లో కుదువ పెట్టి ఆ డబ్బులతో క్రికెట్ బెట్టింగ్ ఆడడంతోపాటు విలాసాలకు ఖర్చు చేసేవాడని తెలిపారు. గతంలో నారాయణపై 57 కేసులు ఉన్నాయని, వాటిలో రెండు తీవ్ర మైన నేరాలు ఉన్నాయని చెప్పారు. అడిషనల్ ఎస్పీ (క్రైమ్స్) ఎల్.అర్జున్, కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్, నిడదవోలు సీఐ పీవీజీ తిలక్, క్లూస్ టీం సీఐ స్వరూప్, ఉండ్రాజవరం, సమిశ్ర గూడెం ఎస్‌ఐలు జి.శ్రీనివాసరావు, కె.వీరబాబు, సీసీఎస్ ఎస్‌ఐ రవీంద్ర, సిబ్బందిని ఎస్పీ ప్రత్యే కంగా అభినందించి రివార్డులు అందజేశారు.