దసరా సెలవులకు వచ్చి.. తిరిగిరాని లోకాలకు..
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:26 AM
కొత్తపేట, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): దసరా సెలవులకు ఇంటికి వచ్చి ఆపై స్నేహితులతో కలిసి గోదావరి ఏటి కాలువలో స్నానానికి వెళ్లి యువకుడు మృతిచెందిన సంఘటన సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి శివారు నక్కావారిపేటలో జరిగింది. ఎస్‌ఐ జి.సురేంద్ర తెలిపిన
ఏటి కాలువలో యువకుడి మృతి
కొత్తపేట, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): దసరా సెలవులకు ఇంటికి వచ్చి ఆపై స్నేహితులతో కలిసి గోదావరి ఏటి కాలువలో స్నానానికి వెళ్లి యువకుడు మృతిచెందిన సంఘటన సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి శివారు నక్కావారిపేటలో జరిగింది. ఎస్‌ఐ జి.సురేంద్ర తెలిపిన వివరాల ప్రకారం... వానపల్లి శివారు నక్కావారిపేటకు చెందిన నక్కా రాంబాబుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నక్కా అఖిల్ (19) సోమవారం ఉదయం తమ్ముడు విజయ, స్నేహితులు యడ్ల రవితేజ, బుడితి సతీష్‌తో కలిసి అద్దంకివారిలంక సమీపంలో గల గోదావరి నదీపాయలో గల ఏటికాలువ వద్దకు స్నానానికి వెళ్లాడు. అఖిల్‌కు ఈత రాకపోవడంతో అవతలి గట్టుకు అరటిబొందలపై వెళ్తున్న తరుణంలో గల్లంతయ్యాడు. స్నేహితు లు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వారి ని ముగ్గుర్ని రక్షించగా అఖిల్ కోసం గాలించి నదీలోంచి బయటకు తీశారు. అపస్మారక స్థితి లో ఉన్న అఖిల్‌ను వెంటనే కొత్తపేట ప్రభు త్వాసుపత్రికి తరలించగా వైద్యులు మృతిచెందినట్టు తెలిపారు. దీంతో తండ్రి నక్కా రాంబా బు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సురేంద్ర తెలిపారు. భీమవరంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అఖిల్ దసరా సెలువల కు ఇంటికి వచ్చిన ఇలా మృత్యువాత పడటం తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు జీర్ణించుకోలేకపోయారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు బాధితులను పరామర్శించారు.