Share News

యానాం ఎమ్మెల్యే ఫొటోతో పోస్టులు

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:54 AM

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 9 (ఆంధ్ర జ్యోతి): యానాం ఎమ్మెల్యే ఫొటోను సామాజిక మాధ్యమాల్లో డీపీగా పెట్టుకుని మహిళలను మోసం చేసిన కేసులో రాజమహేంద్రవరానికి చెందిన ఓ యువకుడిని హైదరాబాద్‌ పోలీసు లు అరెస్టు చేసి విచారిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన జోగాడ వంశీ కృష్ణ, యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్‌ గతంలో ఒకే కళాశాలలో చదు వుకున్నారు. ప్రస్తుతం వంశీ హైదరాబాద్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నా

యానాం ఎమ్మెల్యే ఫొటోతో పోస్టులు

మహిళలను మోసం చేసిన రాజమండ్రి యువకుడి అరెస్ట్‌

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 9 (ఆంధ్ర జ్యోతి): యానాం ఎమ్మెల్యే ఫొటోను సామాజిక మాధ్యమాల్లో డీపీగా పెట్టుకుని మహిళలను మోసం చేసిన కేసులో రాజమహేంద్రవరానికి చెందిన ఓ యువకుడిని హైదరాబాద్‌ పోలీసు లు అరెస్టు చేసి విచారిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన జోగాడ వంశీ కృష్ణ, యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్‌ గతంలో ఒకే కళాశాలలో చదు వుకున్నారు. ప్రస్తుతం వంశీ హైదరాబాద్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడని తెలు స్తోంది. అతడి సోషల్‌ మీడియా ప్రొఫైల్‌ పిక్చర్‌గా ఎమ్మెల్యే ఫొటోను పెట్టుకోవడంతో పాటు అతడితో సాన్నిహిత్యంగా ఉన్నట్టు షాదీ.కామ్‌తోపాటు పలు వివాహ సంబంధిత ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలలో పోస్టులు పెడుతున్నా డు. అలా మోసపోయిన ఓ మహిళ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం వంశీని అరెస్టు చేశారు. 4రాష్ట్రాల్లో సుమారు 26మంది మహిళలను మాయ మా టలతో నమ్మించి మోసం చేశాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్టు సమాచారం.

Updated Date - Apr 10 , 2025 | 12:54 AM