ఆసనం..ఆహ్లాదం
ABN , Publish Date - Jun 22 , 2025 | 01:22 AM
ఉషోదయ వేళ.. ఏదో తెలియని ఉత్సాహం. ఎటుచూసినా తెల్లవారుతున్న ఆకాశం సైతం చిన్నబుచ్చుకునేలా తెల్లని వస్త్రాల్లో నవ్వుతూ సాగుతున్న జనం.. అందరి దారీ అటువైపే. అక్కడకు చేరుకోగానే పచ్చని తివాచీల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణం. వందలు.. వేల మంది ఆయా రహదారులపై ఏర్పాటుచేసిన వేదికల ముందు క్రమశిక్షణగా కొలువుదీరిన సమయం. ఇక మొదలెడదామా అన్నట్టు యోగా గురువుల సందేశం. వెనువెంటనే యోగాసనాల క్రతువు. ఎంతో దీక్షగా, మరెంతో ఉత్సాహంగా గంటల తరబడి సాగిన ఈ ప్రక్రియ ఆనందాన్ని పంచింది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, సా
జిల్లాలో సందడే సందడి
లాలాచెరువు నుంచి వై జంక్షన్ వైపు
సుమారు 1.5 కిలోమీటర్ల పొడవునా రోడ్డు మీద యోగా
హాజరైన కలెక్టర్ పి. ప్రశాంతి. ఎమ్మెల్సీ సోము వీర్రాజు
సెంట్రల్ జైలులో 1300 మంది ఖైదీలతో యోగా
జిల్లాలో 4,500 వేదికలు
ఉషోదయ వేళ.. ఏదో తెలియని ఉత్సాహం. ఎటుచూసినా తెల్లవారుతున్న ఆకాశం సైతం చిన్నబుచ్చుకునేలా తెల్లని వస్త్రాల్లో నవ్వుతూ సాగుతున్న జనం.. అందరి దారీ అటువైపే. అక్కడకు చేరుకోగానే పచ్చని తివాచీల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణం. వందలు.. వేల మంది ఆయా రహదారులపై ఏర్పాటుచేసిన వేదికల ముందు క్రమశిక్షణగా కొలువుదీరిన సమయం. ఇక మొదలెడదామా అన్నట్టు యోగా గురువుల సందేశం. వెనువెంటనే యోగాసనాల క్రతువు. ఎంతో దీక్షగా, మరెంతో ఉత్సాహంగా గంటల తరబడి సాగిన ఈ ప్రక్రియ ఆనందాన్ని పంచింది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, సామాన్య ఉద్యోగులు, సాధారణ పౌరులు.. వృద్ధులు, పిల్లలు, మహిళలు ఇలా అందరూ అమితోత్సాహంతో ఈ యోగాభ్యాసనలో పాల్గొన్న తీరు అందరినీ ఆకట్టుకుంది. ఒత్తిడిని అధిగమించడానికి, సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రాచీనమైన ఈ యోగాను అనుసరించడానికి చూపిన ఆసక్తి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. నెలరోజులపాటు రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర పేరిట తీసుకొచ్చిన చైతన్య స్రవంతి ఒక ప్రవాహంలా అంతర్జాతీయ యోగా దినోత్సవ రోజున పోటెత్తింది.
రాజమహేంద్రవరం, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతంగా జరిగింది. జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆధ్వర్యంలో లాలాచెరువు నుంచి వై.జంక్షన్ వైపు సుమారు కిలోమీటర్నర పొడవున యోగా కార్యక్రమం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ఎమ్మె ల్సీ సోము వీర్రాజు కూడా పాల్గొన్నారు. ఇక బొమ్మూరు హైవేలో రూరల్ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి యోగా చేశారు. సరస్వతీఘాట్‌లో వ్యవసాయశాఖ చేసిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ ఢిల్లీరావు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవ రావు పాల్గొన్నారు. ఎస్పీ ఆఫీసులో జరిగిన యోగా కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా జడ్జి గంధం సునీత భాగస్వామ్యులయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలు లో 1300 మంది ఖైదీలతో ఇన్‌చార్జి సూపరింటెం డెంట్ ఎం.రాజకుమార్ యోగా చేయించారు. రాజ మండ్రి ఎయిర్‌పోర్టులో ఇన్‌చార్జి డైరెక్టర్ ఎన్‌కే శ్రీకాంత్ ఆధ్వర్యంలో యోగా జరిగింది. ఇలా రాజ మహేంద్రవరంలో అన్ని శాఖల ఆధ్వర్యంలోనూ ఉదయం యోగా నిర్వహించారు. దీంతో జిల్లా అం తటా యోగా సందడి నెలకొంది.
ప్రతీ పౌరుడూ యోగా చేయాలి : కలెక్టర్
యోగాతో ఆరోగ్యం, ఆనందం కలుగుతుందని, అందుకే ప్రతీ పౌరుడూ ఆరోగ్యంగా ఉండడంకోసం యోగాభ్యాసం దోహదం చేస్తుందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. లాలాచెరువులో జరిగిన యోగా ప్రధాన కార్యక్రమంలో ఆమె పాల్గొని యోగా చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా యోగా చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడు పిలుపు మేరకు నెలరోజుల నుంచి రాష్ట్రవ్యాప్త కార్యక్రమం యోగాంధ్రలో భాగంగా జిల్లాలో కూడా యోగా అభ్యసించారన్నారు. శనివారం యోగా డే సందర్భంగా మొత్తం 4,500 వేదికలపై యోగా నిర్వహించినట్టు ఆమె చెప్పారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, గ్రామ పంచా యతీలు, గోదావరి ఘాట్లు, సచివాలయాల పరిధి లో యోగా డేని ఘనంగా నిర్వహించినట్టు తెలి పారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ యోగా డేను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేశారన్నారు. అంతర్జాతీయంగా పది కోట్ల మంది యోగా చేస్తే, కేవలం ఆంధ్ర ప్రదేశ్‌లో ఏకంగా 2 కోట్ల మంది యోగా చేయ డం గమనార్హమని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి, ము న్సిపల్ అదనపు కమిషనర్ పీవీ రామలింగేశ్వర్, డీఆర్‌డీఏ పీడీ ఎన్ వీవీఎస్ మూర్తి, సెక్ర టరీ జి.శైలజావల్లి, టీడీపీ నేత చండీ ప్రియ, ఎస్‌ఈ ఎంసీ హెచ్ కోటేశ్వరరావు, సీఎంఎం రామలక్ష్మి, ఈఈ మాధవి, అధి కారులు పాల్గొన్నారు.