Share News

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం: జేసీ

ABN , Publish Date - Jun 09 , 2025 | 12:27 AM

భారతీయ సనాతన వారసత్వ సంపదగా వచ్చిన యోగాను ప్రజలంతా ఆచరిస్తూ సంపూర్ణ ఆరోగ్యం పొందే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యోగా మాసోత్సవాలను నిర్వహిస్తుందని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి పేర్కొన్నారు.

  యోగాతో సంపూర్ణ ఆరోగ్యం: జేసీ

అమలాపురం టౌన్‌, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): భారతీయ సనాతన వారసత్వ సంపదగా వచ్చిన యోగాను ప్రజలంతా ఆచరిస్తూ సంపూర్ణ ఆరోగ్యం పొందే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యోగా మాసోత్సవాలను నిర్వహిస్తుందని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి పేర్కొన్నారు. ఆదివారం అమలాపురం 2వ వార్డులోని డాక్టర్‌ మెట్ల సత్యనారాయణరావు ఆరోగ్య ఉద్యాన వనంలో వయోవృద్ధుల యోగాభ్యాసన కార్యక్రమాన్ని 45నిమిషాల పాటు నిర్వహించారు. అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ తనువు, మనసును ఏకంచేసి సుసంపన్న ఆరోగ్యానికి బాటలువేసే యోగాతో దేశ ధారుడ్యంతో పాటు మానసిక ఆరోగ్యం సొంతమవుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ ప్రజలు తమ జీవన శైలిలో యోగాను అంతర్భాగం చేసుకుంటే ఆరోగ్యవంతమైన సమాజం ఆవిర్భవిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో కె.మాధవి, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి కడలి కాశీవిశ్వేశ్వరరావు, తహశీల్దార్‌లు పలివెల అశోక్‌ప్రసాద్‌, వాసా ఎస్‌.దివాకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ బి.రాణిసంయుక్త, ఆశెట్టి ఆదిబాబు, బోనం సత్యవరప్రసాద్‌, చొల్లంగి సత్యసాయిబాబా, పప్పుల శ్రీరామచంద్రమూర్తి, కౌన్సిలర్‌ ఏడిద శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2025 | 12:27 AM