జిల్లా కలెక్టరేట్ వద్ద వైసీపీ యువత పోరు
ABN , Publish Date - Mar 13 , 2025 | 01:54 AM
రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో యువత పోరు నిరసన కార్యక్రమం జరిగింది.

రాజమహేంద్రవరం సిటీ, మార్చి12 (ఆంద్రజ్యోతి): రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో యువత పోరు నిరసన కార్యక్రమం జరిగింది. నగరంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూ డి రాజా, ఆయన సోదరుడు జక్కంపూడి గణేష్ దానవాయిపేట నుంచి ర్యాలీగా బయలుదేరగా మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ మోరంపూడి నుంచి మాజీ ఎమ్మె ల్యే రౌతు సూర్యప్రకాశరావుతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. వీరు కలిసి కలెక్టరేట్ వరకు వెళ్లలేదు. రూరల్‌లోని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు కార్యాలయానికి చేరుకుని అక్కడ నుంచి కూడా ఎవరివర్గంతో వారే కలెక్టరేట్‌కు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యానారాయణరెడ్డి, మాజీ హోంమం త్రి తానేటి వనిత, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షర్మిళారెడ్డి, డాక్టర్ గూడూరి శ్రీనివాస్‌లు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. 45 నిమిషాలపాటు నిరసన నిర్వహించారు. జేసీ చిన్నరాముడుకి వినతిపత్రం అందించారు. కూటమి ప్రభుత్వం 9 నెలల్లో చేసిందేమిలేదని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవని వారు ఆరోపించారు.