Share News

వైసీపీ పాలనలో చాగల్నాడు నిర్వీర్యం

ABN , Publish Date - Sep 17 , 2025 | 12:41 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో చాగల్నా డు ఎత్తిపోతల పథకాలను పట్టించుకోవపోవడంతో రైతాంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం రంగంపేట మండల పరిషత్‌ కా ర్యాలయంలో ఎంపీపీ రిమ్మలపూడి శ్రీదేవి అధ్య క్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.

వైసీపీ పాలనలో చాగల్నాడు నిర్వీర్యం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నల్లమిల్లి

  • రంగంపేట, బిక్కవోలు మండల పరిషత్‌ సమావేశాల్లో ఎమ్మెల్యే నల్లమిల్లి

అనపర్తి(రంగంపేట), సెప్టెంబరు 16 (ఆంధ్ర జ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో చాగల్నా డు ఎత్తిపోతల పథకాలను పట్టించుకోవపోవడంతో రైతాంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం రంగంపేట మండల పరిషత్‌ కా ర్యాలయంలో ఎంపీపీ రిమ్మలపూడి శ్రీదేవి అధ్య క్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. 2014-19 కాలంలో ఎత్తిపోతల పథకాలకు కోట్ల రూపాయలు మంజూరు చేశామని, వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. కూటమి ప్ర భుత్వం వచ్చాక మరమ్మతులపై దృ ష్టి సారించామన్నారు. ఫెర్టిలైజర్స్‌ వా డకం తగ్గించి సేంద్రీయ వ్యవసా యంపై రైతులు దృష్టి సారించే వి ధంగా ప్రజాప్రతిని ధులు అవగాహన కల్పించాలన్నారు. ఇన్‌చార్జి ఎంపీడీవో రామాంజనేయు లు ఆధ్వర్యంలో వివిధ శాఖల ప్రగతి ని అధికారులు సభకు వివరించారు. కార్యక్రమంలో జడ్పీ టీసీ పేపకాలయ సత్యనారాయణ, ఆత్మా కమిటీ చైర్మన్‌ వెలుగుబంటి సత్యనారాయణ, వివిద శాఖల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా..కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17 నుంచి అక్టోబరు 2 వరకు నిర్వహిం చే స్వస్థ నారి స్వశక్తి పరివార్‌ అభి యాన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి అన్నారు. ఈ మేరకు అనపర్తి మండ లం రామవరంలోను, రంగంపేట మండల పరిషత్‌ కార్యాలయంలోను జరిగిన కార్యక్రమాల్లో ఆయన పోస్టర్లను ఆవిష్కరించారు.

  • పంచాయతీలకు రూ.1.16 కోట్లు

బిక్కవోలు, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని కాపవరం వెటర్నరీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జె.సత్యవేణి జీవీఏ సాధనలో రా ష్ట్రంలో ప్రథమంగా నిలిచిన సందర్భంగా ఆమెను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సత్కరించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ తేతలి సుమ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన విచ్చేసి మాట్లాడారు. పంచాయతీలు 15వ ఆర్థిక సంఘ నిధులు ఖర్చు పెట్టుకునేందుకు వీలు కల్పించామని, మండలంలోని పంచాయతీలకు రూ.1.16 కోట్లు నిధులు వచ్చాయ ని, మండల పరిషత్‌కు కూడా రూ.7 కోట్ల వ రకూ సమకూరాయన్నారు. ప్రజా ప్రతినిధులందరికీ పార్టీలకు అతీతంగా ప్రొటోకాల్‌ పాటిస్తున్నామన్నారు. బిక్కవోలు-అనపర్తి కెనాల్‌ రోడ్డును రూ.7 కోట్లతో మరమ్మతులు చేపట్టనున్నట్లు తెలిపారు. సభలో నూతనంగా ఎంపికైన కొమరిపాలెం, కొంకుదురు ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లు ద్వారంపూడి వెంకటరెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డిలను ఎమ్మెల్యే సత్కరించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి టి.శ్రీదేవి, తహశిల్దార్‌ సత్యకృష్ణ, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2025 | 12:41 AM