Share News

ఇంకెన్నిరోజులో!

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:18 AM

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి తదు పరి విచారణలో అనేక ఆటంకాలు ఎదురవుతు న్నాయి. కేసులో తదుపరి విచారణ కొనసాగించి 90రోజుల్లో ఛార్జిషీటు దాఖలు చేయాలని న్యాయ స్థానం ఆదేశించినా ఇప్పటికీ ఆ దిశగా పెద్దగా పురోగతి కనిపించడం లేదు. గత ప్రభుత్వ పె ద్దల ఆదేశాలతో అప్పట్లో పోలీసులు కేసును నీరుగార్చేయడంతో ఇప్పుడు పూర్తిస్థాయి ఆ

ఇంకెన్నిరోజులో!

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌

హత్య కేసు ఛార్జిషీటు గడువు పెంపు

మరో ఐదునెలల గడువు మంజూరు

చేసిన అట్రాసిటీ న్యాయస్థానం

ఇప్పటికే న్యాయస్థానం 90 రోజులు

గడువు ఇచ్చినా పూర్తికాని తదుపరి విచారణ

ఎస్‌ఎఫ్‌ఎల్‌ నివేదికలు అందకపోవడం, సాక్ష్యుల విచారణ పూర్తవలేదని ప్రాసిక్యూషన్‌ విజ్ఞప్తి

గత వైసీపీ హయాంలో కేసును నీరుగార్చేయడంతో తాజా విచారణలో పోలీసులకు ఎన్ని చిక్కులో

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి తదు పరి విచారణలో అనేక ఆటంకాలు ఎదురవుతు న్నాయి. కేసులో తదుపరి విచారణ కొనసాగించి 90రోజుల్లో ఛార్జిషీటు దాఖలు చేయాలని న్యాయ స్థానం ఆదేశించినా ఇప్పటికీ ఆ దిశగా పెద్దగా పురోగతి కనిపించడం లేదు. గత ప్రభుత్వ పె ద్దల ఆదేశాలతో అప్పట్లో పోలీసులు కేసును నీరుగార్చేయడంతో ఇప్పుడు పూర్తిస్థాయి ఆధా రాల సేకరణ పోలీసులకు కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేం ద్రవరంలోని అట్రాసిటీ న్యాయస్థానం ఇదివరకే ఇచ్చిన 90రోజుల గడువు బుధవారంతో ముగిసి పోయింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఇచ్చిన గడువులోగా ఛార్జిషీటు దాఖలు చేయలేని పరి స్థితి నెలకొనడంతో మరో ఐదునెలల పాటు అద నపు గడువు కావాలని తాజాగా ప్రాసిక్యూషన్‌ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. హత్యకు సంబ ంధించి డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతదేహం నుంచి సేకరించి నమూనాలను స్టేట్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపి చాలా కాలం అవుతున్నా ఇంకా వాటికి స ంబంధించి లోతైన విశ్లేషణ నివేదిక అందలేదని ప్రాసిక్యుషన్‌ కోర్టుకు వివరించింది. అలాగే కేసు తదుపరి విచారణలో భాగంగా గూగుల్‌ టేకవుట్‌, నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతాబు కాల్‌ డేటా సేకరణ, హత్య సమయంలో నిందితుడితో ఉన్న కొందరు వ్యక్తులు, కుటుంబ సభ్యుల వాం గ్మూలాలు తీసు కోవాల్సి ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ లోతుగా చేప ట్టి ఛార్జిషీట్‌ దాఖలకు ఐదు నెలల గడువు కోరిం ది. వీటన్నింటిని పరిశీలించిన న్యాయస్థానం మ రో ఐదునెలల పాటు అదనపు గడువు మంజూ రు చేసింది.

అప్పుడు ఏం జరిగింది..?

కాగా ప్రశాంత నగరంగా పేరొందిన కాకినాడ 2022 మేలో అట్టుడికిపోయి ంది. తన వద్ద పని చేసే దళిత డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి మృతదేహాన్ని ఏకంగా మృతుడి ఇంటికి డోర్‌ డెలివరీ చేశాడు. అప్పటి సీఎం జగన్‌కు అత్యంత సన్ని హితుడిగా పేరొందిన ఎమ్మెల్సీ అనంతబాబు 2022 మే 18న రాత్రి కాకినాడలో డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం ఇంటికి వచ్చి పని ఉందని తీసుకువెళ్లాడు. ఆ తర్వాత కా కినాడ బీచ్‌రోడ్డులో నిర్జీవ ప్రదేశానికి తీసుకువెళ్లి బలమైన కర్రతో శరీరంపై 30చోట్ల దారుణంగా దాడి చేసి చిత్రహింసలకు గురి చేసి కొట్టి చంపా డు. తెల్లవారుజామున మే19న మృతదేహాన్ని స్వయంగా తన కారులో అనంతబాబు కాకినాడ కుళాయిచెరువు ఎదురుగా ఉన్న డ్రైవర్‌ ఇంటికే తీసుకువచ్చాడు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. రోడ్డు ప్రమా దంలో సుబ్రహ్మణ్యం చనిపోయాడని ఆయన తల్లిదండ్రులను నమ్మించే ప్రయత్నం చేశాడు. తీరా కుటుంబీకులు తిరగబడ్డంతో అంత్యక్రి య లకు డబ్బులు ఇస్తానని, నోరు తెరవొద్దని బెదిరి ంచాడు. ఆగ్రహంతో బాధితులు నిలదీయడంతో కారు వదిలేసి అక్కడి నుంచి అనంతబాబు పారి పోయాడు. ఆ తర్వాత అరెస్ట్‌ అవకుండా ప్రయ త్నించాడు. అధికారంలో ఉన్న వైసీపీ నేతల అం డదండలతో మూడురోజులు ఓ ఇంట్లో మకాం వేశాడు. ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడు కావ డంతో అనంతబాబు కోసం పోలీసులు కనీసం గాలించలేదు. ఆ తర్వాత మీడియా ఒత్తిడితో గాలింపు ముమ్మరం చేయగా, అదే సమయంలో హత్య తానే చేశానని పోలీసుల ఎదుట అనం తబాబు ప్రత్యక్షమయ్యాడు. తీరా అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసులు కేసును నీరుగార్చడం కోసం కేవలం అనుమానాస్పద హత్యగా కేసు నమోదు చేయడానికి ప్రయత్నించారు. కానీ బాధితులు, దళితసంఘాలతో ఆందోళనతో చివరకు కేసును హత్యకేసుగా మార్చారు. ఆ తర్వాత అనంత బాబును అరెస్ట్‌ చేసి రాజమహేంద్రవరం సెంట్ర ల్‌జైలుకు తరలించారు. ఆ తర్వాత పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీటులోను అనంతబాబుకు అనుకూలంగా వ్యవహరించారు. అయితే సుదీర్ఘ కాలం జైల్లో గడిపిన అనంతబాబు మధ్యంతర బెయిల్‌పై ప్రస్తుతం స్వేచ్ఛగా బయటే తిరుగు తున్నాడు. కాగా హత్య కేసు ఆరోపణలతో అనం తబాబును పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించిన జగన్‌, ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన అనంతబాబును పక్కన పెట్టుకుని వైసీపీ మంత్రులతోపాటు అప్పట్లో సీఎం జగన్‌ సైతం బహిరంగ సభలకు హాజర వడం తీవ్ర దుమారం రేపింది. అయితే ప్రభు త్వం మారాక కేసు విచారణ వేగం పుంజుకుంది. ఈ కేసుపై తొలి నుంచీ పోరాటం చేస్తోన్న ప్ర ముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు సహ కారం పోలీసులకు అవసరం అని ప్రభుత్వం భా వించి కొంతకాలం కిందట ఆయన్ను ప్రాసి క్యూషన్‌కు సహకరించేందుకు నియమించింది. ఆ తర్వాత రాజమహేంద్రవరం న్యాయస్థానంలో కేసు మరింత లోతైన విచారణకు ప్రాసిక్యూషన్‌ కేసు దాఖలు చేయడగా, జులై 22 నుంచి 90 రోజుల్లోపు తదుపరి విచారణ పూర్తి చేసి ఛార్జిషీటు దాఖలు చేయాలని ఆదేశించింది.

Updated Date - Oct 25 , 2025 | 12:18 AM