Share News

ధాన్యం కొనుగోలు చేయాలని వైసీపీ రిలే దీక్షలు

ABN , Publish Date - May 08 , 2025 | 12:42 AM

కోనసీమ జిల్లాలో ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అమలాపురంలోని వంటెద్దు కాంప్లెక్సు వద్ద జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో భారీగా రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని నిర్వహించారు.

ధాన్యం కొనుగోలు చేయాలని వైసీపీ రిలే దీక్షలు

అమలాపురం, మే7(ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లాలో ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అమలాపురంలోని వంటెద్దు కాంప్లెక్సు వద్ద జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో భారీగా రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని నిర్వహించారు. కలెక్టరేట్‌కు వెళ్లే మార్గంలో వంటెద్దు వెంకన్నాయుడు కాంప్లెక్సు వద్ద ఏర్పాటుచేసిన వైసీపీదీక్షా శిబిరాన్ని వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో రైతు సేవా కేంద్రా లకు విధించిన ఆంక్షలు తొలగించాలని, వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో ప్రధానంగా ఈకార్యక్రమం నిర్వహించారు. వందల సంఖ్యలో పార్టీ శ్రేణులు దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, జడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాల్‌, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, కుడుపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయిల్‌, పండుల రవీంద్రబాబు, మాజీమంత్రులు గొల్లపల్లి సూర్యారావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు పొన్నాడ సతీష్‌కుమార్‌, డాక్టర్‌ పినిపే శ్రీకాంత్‌, గన్నవరపు శ్రీనివాస్‌, పిల్లి సూర్యప్రకాష్‌, మాజీ ఎంపీ చింతా అనురాధ, మాజీ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరిదేవి, మున్సిపల్‌ చైర్మన్‌ రెడ్డి సత్యనాగేంద్రమణి, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు రిలే దీక్షలో పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 12:42 AM