అనపర్తిలో వైసీపీకి షాక్
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:58 AM
అనపర్తిలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ ఎంపీపీ, వైస్ ఎంపీపీ, నలుగురు ఎంపీటీసీలు శుక్రవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు.
అదే బాటలో నలుగురు ఎంపీటీసీలు
అనపర్తి, జూన్ 27 (ఆంధ్రజ్యోతి) : అనపర్తిలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ ఎంపీపీ, వైస్ ఎంపీపీ, నలుగురు ఎంపీటీసీలు శుక్రవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. విజయవాడ కుంచనపల్లిలోని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనపర్తి వైసీపీకి చెందిన ఎంపీపీ అనసూరి సూర్యనారాయణ(బుజ్జి), ఎంపీటీసీ పద్మావతి, కుతుకులూరు ఎంపీటీసీ, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు పులగం బులిరెడ్డి, రామవరం ఎంపీటీసీలు నల్లమిల్లి భాగ్యలక్ష్మి, గొలుగూరి గౌతమి, పెడపర్తి ఎంపీటీసీ తమలంపూడి మణిలకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరామన్నారు.వీరి వెంట సత్తి దేవదానరెడ్డి, తేనెల శ్రీనివాస్, కర్రి చిన్నారెడ్డి, నల్లమిల్లి శ్రీనివాసరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి ఉన్నారు.