టీడీపీ కార్యకర్తపై వైసీపీ నాయకుల దాడి
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:16 AM
రంపచోడవరం/గంగవరం, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా గంగవరం మండలంలో టీడీపీ కార్యకర్తపై వైసీపీ నాయ కులు బుధవారం సాయంత్రం కత్తితో దాడి చేసి గాయపర్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. పిడ తమామిడి గ్రామానికి చెందిన రెడ్డి వేణుగోపాల్ రెడ్డి టీడీపీ కార్యకర్త. పంచాయితీ ఎన్ని
బాధితుడికి ఎమ్మెల్యే పరామర్శ
రంపచోడవరం/గంగవరం, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా గంగవరం మండలంలో టీడీపీ కార్యకర్తపై వైసీపీ నాయ కులు బుధవారం సాయంత్రం కత్తితో దాడి చేసి గాయపర్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. పిడ తమామిడి గ్రామానికి చెందిన రెడ్డి వేణుగోపాల్ రెడ్డి టీడీపీ కార్యకర్త. పంచాయితీ ఎన్నికలకు అందరినీ సన్నద్ధం చేస్తున్న పరిణామంలో స్థానికంగా ఉండే వైసీపీ నాయకులకు ఓర్వలేక వేణుగోపాలరెడ్డితో ఘర్షణకు దిగారు. యెజ్జు వెంకటేశ్వరరావు, యెజ్జు రామకృష్ణ, తుమ్మల చిట్టిబాబు, బలిజ వీరబాబు, జగ్గు నూకరాజు వేణుగోపాలరెడ్డిపై దాడి చేసి గాయపర్చారు. రామకృష్ణ కత్తితో దాడి చేయగా వేణుగోపాలరెడ్డి చేతికి గాయమైంది. దీంతో ప్రాణాలను కాపాడు కోవడానికి అక్కడి నుంచి పారిపోయి, పిడత మామిడి పీహెచ్‌సీకి చేరుకుని వైద్యం అనం తరం దాడి విషయాన్ని మండలంలో టీడీపీ నా యకులకు అందించారు. వారు బాధితుడ్ని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలిం చారు. సమాచారం తెలుసుకున్న రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి బుధవారం రాత్రి బాధితుడ్ని పరామర్శించి పార్టీ అండగా ఉంటు ందని హామీ ఇచ్చారు. బాధ్యులపై తగు చర్యల ను తీసుకోవాలని పోలీసులను కోరారు. అనం తరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీ ఎదుగుదలను సహించలేని వైసీపి ఎమ్మెల్సీ అనంతబాబు తన నాయకులతో ఇటువంటి దాడులకు పురిగొల్పు తున్నాడన్నారు. దాడి చేసిన వారిపై చట్టపర మైన చర్యలను తీసుకుని తమ కార్యకర్తలకు, నాయకులకు అండగా నిలుస్తామని తెలిపారు.