వైసీపీ నాయకుల నిరసన ప్రదర్శన
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:29 AM
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవే టీకరణ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వబో మని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు.
రాజమహేంద్రవరం, డిసెంబరు 15 (ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవే టీకరణ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వబో మని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. వైసీపీ చేప ట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా జిల్లా నుంచి సేకరించిన సంతకాల పత్రాలను వైసీపీ కేంద్ర కార్యాలయానికి తర లించే ర్యాలీని సోమవారం నిర్వహించారు. జిల్లాలో నాలుగున్నర లక్షల సంతకాలను సేకరించడం జరిగిందన్నారు. కూటమి ప్రభు త్వ విధానాలను జనం తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నారని విమర్శించారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తి రెడ్డి, జక్కం పూడి రాజా, మాజీ హోం మంత్రి తానేటి వనిత తదితరులు పాల్గొన్నారు.