హామీలను గాలికొదిలేసిన ప్రభుత్వం
ABN , Publish Date - Jul 03 , 2025 | 12:31 AM
అమలాపురం రూరల్, జూలై 2(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించేందుకు ప్రతీ నాయకుడు, కార్యకర్త ఇంటింటికీ వెళ్లాలని ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. హామీల అమలుకై ప్రభుత్వాన్ని నిలదీయడమే ప్రతిపక్షం లక్ష్యమని గుర్తించాలన్నారు. ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలే
ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త బొత్స సత్యనారాయణ
అమలాపురం రూరల్, జూలై 2(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించేందుకు ప్రతీ నాయకుడు, కార్యకర్త ఇంటింటికీ వెళ్లాలని ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. హామీల అమలుకై ప్రభుత్వాన్ని నిలదీయడమే ప్రతిపక్షం లక్ష్యమని గుర్తించాలన్నారు. ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమ లాపురం మండలం ఇందుపల్లి ఏ1 కన్వెన్షన్ హాలులో బాబు ష్యూరిటీ..మోసం గ్యారంటీ పేరిట బుధవారం వైసీపీ జిల్లాస్థాయి విస్తృత సమావేశం జిల్లాశాఖ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా బొత్స మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కలిసి బాండ్ పేపరుపై సంతకం పెట్టి మరీ సూపర్-6 పథకాలపై హామీఇచ్చి ప్రజలను నిలువునా మోసం చేశారని విమర్శించారు. తల్లికి వందనం కోసం వైసీపీ పోరాటం చేస్తే ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. హామీలు అమలు చేయకపోతే మెడలు వంచి మీతో చేయిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వైసీపీ అధినేత జగన్ సూచనల మేరకు బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీపై నియోజకవర్గ, మండలస్థాయిల్లో సమావేశాలు ఏవిధంగా నిర్వహించాలో దిశానిర్దేశం చేశారు. జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ మంత్రులు పినిపే విశ్వరూప్, గొల్లపల్లి సూర్యారావు, చెల్లుబోయిన వేణు, కోఆర్డినేటర్లు తోట త్రిమూర్తులు పిల్లి సూర్యప్రకాష్, పొన్నాడ సతీష్‌కుమార్, గన్నవరపు శ్రీను, పినిపే శ్రీకాంత్, మాజీ ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, జక్కంపూడి రాజా, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, పీకే రావు, జక్కంపూడి గణేష్, పితాని బాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి తదితరులుపాల్గొన్నారు.