అది వైసీపీ ఏఐతో చేయించిన ఫేక్ వాయిస్
ABN , Publish Date - Oct 18 , 2025 | 11:29 PM
లిక్కర్ సిండికేట్ పేరుతో తమ పార్టీ నగర అధ్యక్షుడు వాయిస్‌గా చెబుతూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఆడియో టేపు వైసీపీ వాళ్లు ఏఐను ఉపయోగించిన సృష్టి అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. ఒక ప్రైవేట్ హోటల్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు
రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 18(ఆం ధ్రజ్యోతి): లిక్కర్ సిండికేట్ పేరుతో తమ పార్టీ నగర అధ్యక్షుడు వాయిస్‌గా చెబుతూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఆడియో టేపు వైసీపీ వాళ్లు ఏఐను ఉపయోగించిన సృష్టి అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. ఒక ప్రైవేట్ హోటల్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. గతంలో తన తండ్రి ఆదిరెడ్డి అప్పారావు కూడా చిట్టూరి ప్రవీణ్ అనే వ్యక్తికి వార్నింగ్ ఇచ్చినట్టు ఒక వాయిస్ టేపును సృష్టించారన్నా రు. తనకు తండ్రి సమానులైన రూరల్ ఎమ్మె ల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరిని దూషించినట్లు గా క్రియేట్ చేశారని గుర్తుచేశారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతారని చెప్పారు. కూట మి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాజమహేంద్రవరంలో సజావుగా సాగుతున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక వైసీపీ వాళ్లు బురద జల్లుతున్నారన్నారు.మద్యం వ్యాపారులతో తాను మాట్లాడినట్టు వైరల్ అవుతున్న వాయిస్ టేపు లు ఫేక్ అని టీడీపీ నగర అఽధ్యక్షుడు మజ్జి రాంబాబు అన్నారు. ఇటీవల ఏఐతో నకిలీ వీడియోలు, వాయిస్ టేప్‌లు సృష్టిస్తున్నారని అందులో ఇది కూడా ఒకటన్నారు. దీనిపై పోలీసుల కు ఫిర్యాదు చేశానని తెలి పారు. మద్యం వ్యాపారులతో తాను మీటింగ్ పెట్టినట్టు నిరూపించాలన్నారు.తనకు లిక్కర్ షాపులు లేవని తాను మద్యం వ్యాపారులతో మాట్లాడాల్సిన అవసరం లేద న్నారు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేక మా జీ ఎంపీ భరత్‌రామ్ ఫేక్ వీడియోలు వాయిస్‌లు చూపించి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సమావేశంలో శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్, వర్రే శ్రీనివాసరావు, బుడ్డిగ రాధ, ఉప్పులూరి జానకిరామయ్య, కొయ్యల రమణ, మొకమాటి సత్యనారాయణ, శెట్టి జగదీష్, కంటిపూడి శ్రీనివాస్, దాస్యం ప్రసాద్ పాల్గొన్నారు.
‘తూర్పుకాపు నేతను టార్గెట్ చేస్తున్నారు’
తూర్పుకాపు సంఘం నేత మజ్జి రాంబాబు ను టార్గెట్ చేయడం దారుణమని ఆ సంఘం నగర అధ్యక్షుడు పోలాకి పరమేష్ అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ మాజీ ఎంపీ భరత్‌రామ్ తూర్పుకాపుల రాజకీయ ఎదుగుదలను చూసి తట్టుకోలేక రాం బాబుపై బురద జల్లుతున్నారన్నారు. రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో తూర్పుకాపులు 60వేల మంది ఉన్నారని, ఆర్థికం గా బలంగా లేకపోయినా సంఖ్యపరంగా బలంగానే ఉన్నామన్నారు. టీడీపీ నగర అధ్యక్షుడిగా నియమితులైనప్పటి నుంచి రాంబాబును భరత్‌రామ్ టార్గెట్ చేశారని, కక్ష గట్టి తప్పుడు ప్ర చారం చేస్తున్నారన్నారు. చింతా జోగినాయుడు మాట్లాడుతూ హల్‌చల్ అవుతున్న ఫోన్ కాల్ వాయిస్ మజ్జి రాంబాబుది కాదన్నారు. సమావేశంలో అగురు ధనరాజ్, మీసాల నాగమణి, శనపతి సత్తిబాబు, కె.వెంకటేష్, మారి శ్రీనివాస్, బాలకృష్ణ, చిన్న, కృష్ణ, సందక లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
మమ్మల్ని మధ్యలోకి లాగవద్దు: మద్యం వ్యాపారులు
రాజమహేంద్రవరం, అక్టోబరు 18(ఆంధ్ర జ్యోతి): జిల్లాలో సిండికేట్లు, నకిలీ మద్యం, బెల్టు షాపులు లేవని జిల్లా మద్యం వ్యాపారు ల తరపున దేవరపల్లి కృష్ణ, కొత్తపల్లి బాలసు బ్రహ్మణ్యం(బాలు) శుక్రవారం తెలిపారు. టీడీ పీ నగరాధ్యక్షుడు మజ్జి రాంబాబు, మరొక వ్యక్తి మధ్య జరిగిందంటూ మద్యం వ్యాపారం విషయమై ఓ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఆడియో రికార్డింగులతో తమకు సంబంధం లేదన్నారు. రాజకీయపరం గా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తమ ను, ఎక్సయిజ్ అధికారులను మధ్యలోకి లాగ డం సరికాదని తెలిపారు. కార్యక్రమంలో ఆకుల శ్యాంబాబు, చిన్నం నాగమోహన్‌రెడ్డి, మేకా రమేశ్, సానబోయిన సత్యనారాయణ, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.