ఏం చేద్దాం.. ఎటెల్దాం!
ABN , Publish Date - Jul 29 , 2025 | 12:00 AM
వైసీపీ కేడర్‌లో అంతర్మఽథనం మొదలైంది. ఎన్నికల ముందే పార్టీ పెద్దల వైఖరితో దిగా లుపడిన పార్టీశ్రేణులు, నేతలు ఓటమి తర్వా త మరింత నిర్వీర్యమైపోయారు.
పెద్ద నేతల అవినీతి.. కేడర్‌లో అయోమయం
ఐదేళ్ల దోపిడీపై అవాక్కవుతున్న ప్రజానీకం
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
వైసీపీ కేడర్‌లో అంతర్మఽథనం మొదలైంది. ఎన్నికల ముందే పార్టీ పెద్దల వైఖరితో దిగా లుపడిన పార్టీశ్రేణులు, నేతలు ఓటమి తర్వా త మరింత నిర్వీర్యమైపోయారు. వైసీపీ అధి కారంలో ఉండగా చేసిన అవినీతి, అక్రమా లన్నీ సాక్షాధారాలతో బయటపడుతుండడం.. ఒక్కొక్కరూ జైలు పాలవుతుండడంతో తమ భవిష్యత్ ఏంటనే ఆలోచన క్యాడర్‌లో మొద లైంది. నేతల్లో నియోజకవర్గాల పునర్విభజన భయం పట్టుకుంది.2019 ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడి పార్టీని గెలిపిస్తే జగన్ సీఎం అయిన తర్వాత క్యాడర్‌ను వదిలేశారు. వలంటీర్ల పేరు తో గ్రామ నేతల నెత్తిన కుంపటి పెట్టి విలువ లేకుండా చేశారు. స్థానిక సంస్థల ఆదా యా లను వేరే వాటికి మళ్లించి పాలకవర్గాలను నిర్వీర్యం చేశారు. దీంతో అప్పట్లోనే గ్రామ స్థాయి నుంచి కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది.. ఇప్పుడు అది పెరిగి పెద్దదైంది. మనం పార్టీ కోసం అంత చేస్తే మనం కోసం జగన్ ఏం చేయలేదనే ధోరణి పెరిగింది. దీం తో కేడర్ పార్టీకి దూరంగా ఉంటుంది. అప్పట్లో వైవీ సుబ్బారెడ్డిని గోదావరి జిల్లాల కో ఆర్డినేటర్‌గా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులపై కుంపటిలా పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన వల్ల కొన్ని గ్రూపులు తయారయ్యాయి. తర్వాత మిథున్ రెడ్డిని కోఆర్డినేటర్‌గా నియమించగా ఆయన మైన్స్, ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టా రు. నాడు ఇలా ఎవరికి వారు అవినీతికి పాల్పడడంతో నేడు కేడర్‌లో పట్టు లేకుండా పోయింది.గత ఎన్నికల్లో చాలా మంది తమకు ఏదో ఒక పార్టీ అంటూ ఉండాలి కదా అని స్థానిక రాజకీయాల వల్ల పనిచేశారు. చివరకు దారుణంగా వైసీపీ ఓడిపోయిన సంగతి తెలి సిందే. ఆ సమయంలో చాలా మంది నేతలు మౌనందాల్చారు. పలువురు పార్టీలు మారారు. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసిన వారు మాత్రం వారికి మరో ప్రత్యామ్నాయం దొరికే పరిస్థితి లేక ఏదో ఉన్నామనిపిస్తున్నారు. పూర్తిస్థాయిలో జనంలోకి రాలేకపోతున్నారు. వైసీపీ అధిష్ఠానం ఇటీవల ఏ పిలుపు ఇచ్చినా అసలు నేతలు పట్టించుకోకపోవడం గమనా ర్హం. కొంత మంది మాత్రమే ఏదో రోడ్డుపైకి వచ్చి మమ అనిపిస్తున్నారు. వారి వెంట కేడర్ ఉండడంలేదు.పైగా అధికార కూటమి ప్రభు త్వం గత అక్రమాలన్నీ ఆధారాలతో తవ్వుతుం డడంతో ప్రజలతో పాటు పార్టీ శ్రేణులు అవా క్కవుతున్నాయి. ఇసుక, మైన్స్, మద్యం ఇలా అన్నింటా దోపిడీయే ప్రధానంగా సాగడం పట్ల ప్రజలు విస్మయం చెందుతున్నారు. నాటి అరాచకాలన్నీ గుర్తు చేసుకుని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల వద్దకు ఏ ముఖంతో వెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో కేడర్ మునిగిపోయింది. అవ కాఽశం ఇస్తే కూటమి వైపు చూస్తున్నారు.