జయహో కార్మిక!
ABN , Publish Date - May 02 , 2025 | 01:22 AM
కార్మిక చట్టాలపై ప్రతిఒక్కరికి అవగాహన ఉండాలని కొవ్వూ రు 9వ అదనపు జిల్లా జడ్జి అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం(మే డే)ను పలుచోట్ల గురువారం వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొవ్వూ రు బస్టాండ్ సెంటర్‌లోని భవన నిర్మాణ కార్మికులకు మండల లీగల్ సెల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్మికులకు ముందుగా అదనపు జిల్లా జడ్జి అనురాధ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవం
పలుచోట్ల అరుణ పతాకం ఆవిష్కరణ
కార్మిక సంఘాల ర్యాలీలు
కార్మిక చట్టాలపై అవగాహన ఉండాలి
9వ అదనపు జిల్లా జడ్జి అనురాధ
కొవ్వూరు, మే 1 (ఆంధ్రజ్యోతి): కార్మిక చట్టాలపై ప్రతిఒక్కరికి అవగాహన ఉండాలని కొవ్వూ రు 9వ అదనపు జిల్లా జడ్జి అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం(మే డే)ను పలుచోట్ల గురువారం వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొవ్వూ రు బస్టాండ్ సెంటర్‌లోని భవన నిర్మాణ కార్మికులకు మండల లీగల్ సెల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్మికులకు ముందుగా అదనపు జిల్లా జడ్జి అనురాధ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంత రం మాట్లాడుతూ తాను కూడా 2008 మే 1న జ్యూడీషియల్ సర్వీసెస్‌లోకి రావడానికి ప్రమా ణం చేసి వచ్చానన్నారు. కార్మికులు శారీరకం గాను, ఉద్యోగులు మానసికంగాను కష్టపడతారన్నారు. ఏదేమైనప్పటికీ అందరం ప్రపంచ పునః నిర్మాణానికి ఎవరి స్థాయిలో వారు సాయం అందజేస్తున్నారన్నారు. ఈ నెల 1 నుంచి వారం రోజుల పాటు న్యాయసేవలు, కార్మికుల హక్కు లు, కార్మిక చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఎస్‌వీ మునీంద్ర, ఎన్‌బీ కాంతిదర్, ఎం.శ్రీవల్లీ, లేబర్ ఆఫీసర్ సులోచన, నిర్మాణ రంగ కార్మికులు పాల్గొన్నారు. మండలంలోని విజ్జేశ్వరం సెంటర్లో విజయదుర్గ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు కొమ్మన రాముడు, కార్యదర్శి మారెళ్ల శ్రీను జెండా ఆవిష్కరించారు. వాడపల్లిలో గోదావరి గట్టుపై శ్రీకృష్ణ చైతన్య తాపీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వీరా త్రిమూర్తులు, అయినవిల్లి డేవిడ్ జెండా ఆవిష్కరించి మే డే వేడుకలు నిర్వహించారు. శ్రీనివాసపురంలో వినాయక కనస్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ నాయకులు వల్లేపు రాంబాబు, పోతురాజు, కోరమండల్ స్లీపర్ కంపెనీ వద్ద యూనియన్ కార్యదర్శి బీరా రవి, టి.పాపారాయుడు, పుంతలో ముసలమ్మ ఆలయం వద్ద సాయి గణేష్ పెయింటర్స్ యూనియన్ ఆధ్వ ర్యంలో గోసాల శ్రీను, సిద్దిరెడ్డి బాపిరాజు, బాపూజీ, కూరగాయల మా ర్కెట్ వద్ద బజారు జట్టు వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం.వీరబాబు, కె.కనకారావు, బుద్ధుడి విగ్రహం వద్ద హమాలీ కార్మికుడు సాజిపల్లి పెంట య్య, బస్టాండ్ సెంటర్ చైతన్య తాపీవర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద మైగాపుల నాగేశ్వరరావు, బస్టాండ్ గ్యారేజ్ వద్ద సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.సుందరబాబు జెండా ఆవి ష్కరించారు. అనంతరం పట్టణంలోని అల్లూరి సీతారామరాజు విగ్ర హం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. అక్కడ మద్దుకూరి దొరయ్య అధ్యక్షతన కార్మికుల సభ నిర్వహించారు. సుందరబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఉన్న కార్మిక చట్టాలను విస్మరించి కార్పొరేట్లకు, పెట్టుబడిదార్లకు అనుకూలంగా తీసుకువచ్చిన లేబర్‌కోడ్‌లను రద్దు చేసే వరకు కార్మికులంతా ఐక్య గా ఉద్య మించాలని పేర్కొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన అదనపు జిల్లా జడ్జి ఎం.అనురాధ, కార్మికశాఖ అధికారి అలోచనకు కార్మికులు తమ సమస్యలను తెలియజేశారు. ఆరు సంవత్సరాలుగా కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు అమలుకావడం లేదని, ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా చట్టాన్ని, కార్మికుల నిధులను సక్రమంగా ఖర్చు చేయడం లేదన్నారు. కొవ్వూరు పట్టణ, మండలంలో ఐఎఫ్‌టీయు ఆధ్వర్యం లోను, హౌస్‌మేట్స్‌తో ప్రగతీశీల మహిళా సం ఘం నాయకురాలు ఈమని మల్లిక ఆధ్వర్యంలో మే డే వేడుకలు నిర్వహించారు. చికాగో అమరవీరులకు జోహర్లు అర్పించారు. పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు ప్రత్యేక రక్షణ సదుపాయాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో వి.భవాని, సా యి, ఐఎఫ్‌టీయూ నాయకుడు శ్రీను, రాజు, పీడీ ఎస్‌యూ నాయకుడు నంబూరి మహర్షి పాల్గొన్నారు. బస్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఐఎఫ్‌టీయూ ఆధ్వ ర్యంలో పట్టణ కార్యదర్శి చీర అప్పా రావు జెండా ఆవిష్కరించారు. మెరకవీధి వాటర్‌ట్యాంకు వద్ద గోదావరిమాత మెకానికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎం.చంద్రరావు, రామారావు ఆధ్వర్యంలో మే డే వేడుకలు నిర్వహించారు.
రాజమహేంద్రవరంలో..
రాజమహేంద్రవరం సిటీ, మే 1( ఆంధ్రజ్యోతి): కార్మికులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గురువారం వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం కంబాలచెరువు మదర్ థెరిస్సా పార్కు వద్ద టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభకు ఎమ్మెల్యే వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ముఖ్యఅతిఽథులుగా విచ్చేశారు. ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ దేశాభివృద్ధిలో కార్మికులదీ కీలక పాత్ర అని, ప్రభుత్వం వారి సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. రెండేళ్ల క్రితం వైసీపీ వాళ్లు తనను, తన తండ్రిని అన్యాయంగా మే డే నాడే అరెస్టు చేసి జైలుకు పంపారని, మేడే స్ఫూర్తితోనే పోరాడి బయటకు వచ్చామన్నారు. గ్యాస్ ఏజెన్సీ కార్మికులకు మంచి అగ్రిమెంట్ చేయించామని, పేపరుమిల్లు పరంపర కార్మికులకు న్యా యం చేశామని, మిల్లులో టీఎన్‌టీయూసీ జెండా ఎగురవేయాలన్నారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ కార్మికులను సత్కరించారు. కార్యక్రమంలో వర్రే శ్రీనివాస్, బాక్స్ ప్రసాద్, బట్లంకి ప్రకాష్, టీఎన్‌టీయూసీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. స్థాని క సోమాలమ్మ గుడి ప్రాంతంలో టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డి మణేశ్వర రావు, రెడ్డిరాజు ఆధ్వర్యంలో రెడ్డి వీరాస్వామి స్థూపం వద్ద టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ నివాళుల ర్పించారు. స్థానిక టింబర్ యార్డులో సామిల్లు వర్కర్స్ యూనియన్ ఏఐ ఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో అరుణ పతాకాన్ని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కుంచే అంజిబాబు, కె.జోజి ఆవిష్కరించారు. ఏపీఆర్‌సీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రమేష్, పీడీఎస్‌యూ(వి) రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్, పీవోడబ్ల్యు స్ర్తీవిముక్తి ఉమ్మడి జిల్లా కన్వీనర్ సంగీత, పాల్గొన్నారు. ఆర్యాపురం కర్రల అడితిలో హామారీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో, రైల్వే మెమోకార్ షెడ్డ్ వద్ద, ఐదు బళ్ల మార్కెట్ వద్ద కార్మిక దినోత్సవం జరిగింది. ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్య క్షుడు ఏవీ రమణ,రైల్వే వర్కర్స్ యూనియ్ అధ్య క్షుడు ఎన్.రాజేష్, వా సంశెట్టి భద్రం, గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ నాయకుడు చనపతి శివకుమార్ ఎర్రజెండాలను ఆవిష్కరించారు.