Share News

చిత్తశుద్ధితో పనిచేయాలి

ABN , Publish Date - Mar 11 , 2025 | 01:23 AM

మండలంలో పంచాయతీ కార్యదర్శులు పారిశుధ్య నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా పంచాయతీ అధికారి వి.శాంతామణి అన్నారు.ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల పర్యవేక్షణలో భాగంగా సోమవారం డీఎల్‌పీవో ఎం.నాగమణితో కలిసి ఆమె మండలంలోని ఎస్టీ రాజాపురం, ఈలకొలను, జి.దొంతమూరు గ్రామాల్లో పర్యటించారు. ప్రజల వద్దకు వెళ్లి పారిశుధ్య సిబ్బంది ఇంటింటా చెత్త సేకరణ సేవలను పరిశీలించారు.

చిత్తశుద్ధితో పనిచేయాలి
ఈలకొలనులో మహిళలతో మాట్లాడుతున్న డీపీవో శాంతామణి

పారిశుధ్య నిర్వహణపై జిల్లా పంచాయతీ అధికారి శాంతామణి

రంగంపేట, మార్చి 10(ఆంధ్రజ్యోతి): మండలంలో పంచాయతీ కార్యదర్శులు పారిశుధ్య నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా పంచాయతీ అధికారి వి.శాంతామణి అన్నారు.ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల పర్యవేక్షణలో భాగంగా సోమవారం డీఎల్‌పీవో ఎం.నాగమణితో కలిసి ఆమె మండలంలోని ఎస్టీ రాజాపురం, ఈలకొలను, జి.దొంతమూరు గ్రామాల్లో పర్యటించారు. ప్రజల వద్దకు వెళ్లి పారిశుధ్య సిబ్బంది ఇంటింటా చెత్త సేకరణ సేవలను పరిశీలించారు. గ్రామాల్లో నేరుగా మహిళలతో మా ట్లాడి తడిచెత్త, పొడిచెత్త పట్ల ఉన్న అవగాహనను అంచనా వేశా రు. సేకరించిన తడి చెత్తను వెంటనే సంపద తయారీ కేంద్రానికి తీసుకెళ్లి వర్మీ కంపోస్ట్‌ త యారు చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. గ్రామంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం పనిచేస్తుందా? రోజు విడిచి రోజు ఇళ్ల వద్ద చెత్త సేకరణ జరుగుతుందా? తడి, పొడి చెత్తపై అవగాహన ఉందా? అని ప్ర శ్నించారు. చెత్త సేకరణను శాస్ర్తీయ పద్ధతిలో చేయడం, సంపద సృష్టి కేంద్రంలో వర్మీ కంపోస్ట్‌ ఎరువును తయారు చేయడం ద్వారా పంచాయతీలకు ఆదాయం రావడమే కాకుండా ప్ర జల ఆరోగ్యం మెరుగు పడుతుందన్నారు. కార్యదర్శులు పారిశుధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, కార్యదర్శుల పనితీరును విస్తరణాఽధికారి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, మండలంలోని ప్రతి సంపద సృష్టి కేంద్రాల్లో వర్మీ కంపోస్ట్‌ తయారు చేయాలని ఆదేశించారు. పనితీరు మార్చుకోని కార్యదర్శులపై చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. డీపీవో వెంట ఈవో పీఆర్డీ పి.వెంకటరత్నం ఉన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 01:23 AM