Share News

పిల్లలను స్కూల్‌కు పంపి...

ABN , Publish Date - Oct 19 , 2025 | 01:14 AM

అనపర్తి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): క్షణికావేశంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో శనివారం జరిగింది. రాజమహేంద్రవరానికి చెందిన నమ్మి సంతోష్‌ ఇన్సూరెన్సు కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడికి ధవళేశ్వరానికి చెందిన శిరీష (30)తో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి సంతానం. కొంతకాలంగా వారు అనపర్తిలోని

పిల్లలను స్కూల్‌కు పంపి...
శిరీష (ఫైల్‌), పోలీసుల ఒడిలో అమాయకంగా చూస్తున్న శిరీష కుమార్తె

అనపర్తిలో వివాహిత ఆత్మహత్య

అత్తింటి వేధింపులే కారణమంటున్న మృతురాలి తల్లి

అనపర్తి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): క్షణికావేశంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో శనివారం జరిగింది. రాజమహేంద్రవరానికి చెందిన నమ్మి సంతోష్‌ ఇన్సూరెన్సు కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడికి ధవళేశ్వరానికి చెందిన శిరీష (30)తో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి సంతానం. కొంతకాలంగా వారు అనపర్తిలోని సిందుట వర్స్‌లో నివాసం ఉంటున్నారు. శనివారం భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన తరువాత ఒక పాపను, బాబును స్కూలుకు పంపించిన శిరీష బెడ్‌రూమ్‌లోకి వెళ్లి తలుపు గడియ వేసుకుని ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ఆమె ఎంత కూ పలకకపోవడంతో అత్త కృష్ణవేణి చుట్టుపక్కల వారిని పిలవగా వారు తలుపును పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. స్థానికుల సమాచారంతో ఏఎస్‌ఐ దుర్గాప్రసాద్‌, ట్రైనీ ఎస్‌ఐ సుజాత సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కాగా ఉద యం జండూ బామ్‌ కనిపించడం లేదని అడగగా వెతుక్కోండని శిరీష సమాధా నం చెప్పడంతో కొంత ఘర్షణ జరిగిందని, తాను ఇంటి నుంచి వెళ్లిపోయానని సంతో ష్‌ చెప్తున్నాడు. అయి తే మృతురాలి తల్లి లంక అమ్మాజీ మా త్రం భర్త, అత్త, ఆడపడుచు వేధింపుల వల్లే తమ కుమార్తె మరణించిందని చెప్తుంది. కుమార్తె మృతితో ముగు ్గరు చిన్నారులు దిక్కులేనివారిగా మిగిలారని ఆమె రోదన చూపరులను కలచివేసింది. రెండేళ్లు కూడా నిండని శిరీష కుమార్తె ఇంటికి వచ్చిన పోలీసులను అమ్మ అమ్మ అంటూ మృతదేహం ఉన్న గదివైపు రమ్మని పిలవడం అక్కడున్న వారి హృదయాలను కలచివేసింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ శ్రీను నాయక్‌ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనపర్తి ఏరియాఆసుపత్రికి తరలించామన్నారు.

Updated Date - Oct 19 , 2025 | 01:14 AM