Share News

మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి

ABN , Publish Date - Dec 13 , 2025 | 12:51 AM

స్వయం సహాయక సంఘాల మహిళలు స్వ యం సమృద్ధి సాధించి తమ జీవనప్రమాణాలు పెంపొందించుకోవాలని డీఆర్‌డీఏ అడిషనల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ సత్యం నాయుడు ఆకాంక్షించారు.రాజానగరంలోని సెర్ప్‌ కార్యాలయంలో నాలుగు రోజులుగా జరుగుతున్న ఐబీ విజన్‌ శిక్షణా కార్యక్రమం శుక్రవారం ముగిసింది.

మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఏపీడీ సత్యం నాయుడు

  • డీఆర్‌డీఏ ఏపీడీ సత్యం నాయుడు

రాజానగరం, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): స్వయం సహాయక సంఘాల మహిళలు స్వ యం సమృద్ధి సాధించి తమ జీవనప్రమాణాలు పెంపొందించుకోవాలని డీఆర్‌డీఏ అడిషనల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ సత్యం నాయుడు ఆకాంక్షించారు.రాజానగరంలోని సెర్ప్‌ కార్యాలయంలో నాలుగు రోజులుగా జరుగుతున్న ఐబీ విజన్‌ శిక్షణా కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపు మహిళలు స్వశక్తితో ఆర్థికం గా బలోపేతం కావాలన్నారు. సొం తంగా వ్యాపార కార్యక్రమాలు చేపట్టేందుకు బ్యాంకుల నుంచి సబ్సిడీతో కూడిన రుణాలను ప్రభుత్వం మం జూరు చేస్తోందని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఐబీ సంపత్‌, శ్రీనివాస్‌, సెర్ప్‌ ఏపీఎం గుమ్మడి సునీత, సీసీ ఆశ, నాగార్జున, భీమరాజు, లక్ష్మి, మండల సమాఖ్య అధ్య క్షురాలు నంద్యాల లక్ష్మి, వీవోఏలు పాల్గొన్నారు.

  • బిక్కవోలులో..

స్థానిక మహిళా శక్తి భవనంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న విజన్‌-1పై శిక్షణ శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన ముగింపు సభలో మహిళా సమాఖ్య మండలాధ్యక్షురాలు చిన్నమ్ములు మాట్లాడారు. మండలంలోని మహిళా శక్తి సంఘాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని వీవోఏలు, వీవోలకు సూచించారు. తీసుకున్న శిక్షణను గ్రామాల్లో అమలు చేయాలన్నారు. ప్రతి డ్వాక్రా మహిళకు విద్య, వైద్యం కల్పించి వారిలో పేదరికాన్ని పోగొట్టి జీవనోపాధి మెరుగుపడేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎం సుప్రియ, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 13 , 2025 | 12:51 AM