Share News

ప్రాణం నిలబెట్టేందుకు పాట్లు!

ABN , Publish Date - Sep 30 , 2025 | 12:25 AM

చింతూరు, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పాము కాటుకు గురైన మహిళ ప్రాణాలు కాపా డడానికి ఆ కుటుంబం నానా పాట్లు పడాల్సి వచ్చింది. వరదతో రహదారి మూసుకపోవడ ంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ముందు ఓ ద్విచక్ర వాహనంపై తర్వాత నాటు పడవపై చివరకు ఆటోపై ఆసుపత్రికి చేర్చాల్సి వచ్చింది. అల్లూరి జిల్లా చిం

ప్రాణం నిలబెట్టేందుకు పాట్లు!
రత్తమ్మను నాటు పడవపై ఆసుపత్రికి తరలిస్తున్న కుటుంబ సబ్యులు

పాము కాటుకు గురైన మహిళ

అడ్డంకుల మధ్య ఆసుపత్రికి తరలింపు

చింతూరు, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పాము కాటుకు గురైన మహిళ ప్రాణాలు కాపా డడానికి ఆ కుటుంబం నానా పాట్లు పడాల్సి వచ్చింది. వరదతో రహదారి మూసుకపోవడ ంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ముందు ఓ ద్విచక్ర వాహనంపై తర్వాత నాటు పడవపై చివరకు ఆటోపై ఆసుపత్రికి చేర్చాల్సి వచ్చింది. అల్లూరి జిల్లా చింతూరు మండలం పెద్దసీతనపల్లికి చెందిన శ్యామల రత్తమ్మ తన ఇంటి సమీపంలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ వద్ద వాచ్‌మెన్‌గా వ్య వహరిస్తోంది. ఎప్పటి మాదిరిగానే సోమవారం రత్తమ్మ టవర్‌ వద్ద శుభ్రం చేసేందుకు వెళ్లి పాము కాటుకు గురైంది. కుటుంబీకులకు విష యం తెలిపింది. పెద్ద సీతనపల్లి నుంచి చిం తూరు ఏరియా ఆసుపత్రికి వెళ్లాలంటే 12 కిమీ ప్రయాణం చేయాల్సి ఉంది. కాగా నడుమ సోకి లేరు వాగు పొంగి ఉండడంతో ఆ వైపు వాహ నాలు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో ద్విచక్ర వాహ నంపై ఇద్దరు కలిసి ముందుగా రత్తమ్మను సోకి లేరు వాగు వద్దకు తరలించారు. వెనువెంటనే నాటు పడవపై సోకిలేరు వాగు దాటించారు. ఇక చీకటి వాగు కారణంగా రహదారి నీట ము నిగి ఉండడంతో ఆటోపై వయా వేగితోట మీదు గా చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కోటిరెడ్డి రత్తమ్మకు చికిత్స అందించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్‌ కోటిరెడ్డి తెలిపారు.

Updated Date - Sep 30 , 2025 | 12:25 AM