Share News

మహిళల ఆర్థిక ప్రగతే లక్ష్యం

ABN , Publish Date - May 03 , 2025 | 01:28 AM

మహిళల ఆర్థిక ప్రగతే ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. స్థానిక దర్బా వారి సత్రం, తాడితోట అంబేడ్కర్‌ నగర్‌, తుమ్మలోవ, నారాయణపురం, 47వ డివిజన్‌లలో 800 మంది మహిళలకు కుటు శిక్షణా కార్యక్రమాన్ని ఆయా కేంద్రాల్లో ఎమ్మెల్యే వాసు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి పది టైలరింగ్‌ కుటుమిషన్‌ సెంటర్లను మం జూరు చేసిందన్నారు. నగరంలో 3వేల మందికి శిక్షణ ఇస్తామన్నారు.

మహిళల ఆర్థిక ప్రగతే లక్ష్యం
కుట్టు శిక్షణా కేంద్రం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వాసు

  • కుట్టు శిక్షణా కేంద్రం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వాసు

రాజమహేంద్రవరం సిటీ, మే 2(ఆంధ్రజ్యోతి): మహిళల ఆర్థిక ప్రగతే ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. స్థానిక దర్బా వారి సత్రం, తాడితోట అంబేడ్కర్‌ నగర్‌, తుమ్మలోవ, నారాయణపురం, 47వ డివిజన్‌లలో 800 మంది మహిళలకు కుటు శిక్షణా కార్యక్రమాన్ని ఆయా కేంద్రాల్లో ఎమ్మెల్యే వాసు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి పది టైలరింగ్‌ కుటుమిషన్‌ సెంటర్లను మం జూరు చేసిందన్నారు. నగరంలో 3వేల మందికి శిక్షణ ఇస్తామన్నారు. 2014-19 టీడీపీ ప్రభుత్వంలో ఉచిత కుట్టుశిక్షణ అందిస్తే వైసీపీ పాలనలో మిషన్లను మూలన పడేసారని ధ్వజమెత్తారు. మూడు నెలల పాటు జరిగే ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందాలన్నారు. తాడితోటలో ఏర్పాటు చేసిన కుట్టి మిషన్‌ సెంటర్‌లో 6,7,8, 10,11,12,13,14,15, 31 వార్డులకు, గోదావరి గట్టు సెంటర్‌లో 21,22,23,24,25,29,30 వార్డులకు, తు మ్మలావ సెంటర్‌లో 32,33,34,35,36,37,38,38,5 వార్డులకు, 47వ వార్డు కమ్యూనిటీహాలులో సెం టర్‌లో 40,41,42,43,44,45,46,47,48,49 వార్డులకు, నారాయణపురం సెంటర్‌లో 1,2,3,4,9,50 వార్డుల వారికి శిక్షణా తరగతలు నిర్వహిస్తారని వాసు చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేషన్‌ సెక్రటరీ శైలజావల్లి, టీడీపీ పార్లమెంట్‌ కమిటి ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు, వర్రే శ్రీనివాస్‌, యిన్నమూరి దీపు, రుంకాని విజయ్‌, శెట్టిజగదీష్‌, నల్లం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2025 | 01:28 AM