Share News

భర్త మరణాన్ని తట్టుకోలేక బలవన్మరణం

ABN , Publish Date - Sep 04 , 2025 | 12:55 AM

సర్పవరం జంక్షన్‌, సెప్టెంబరు 3 (ఆంధ్ర జ్యోతి): భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. అతడు లేని జీవితాన్ని ఊహించలేకపోయింది. రెండేళ్ల కుమారుడ్ని ఏ విధంగా పెంచి పెద్ద చేయాలో ఎంతో ఆలోచించింది.. చివరకు జీవితం పై విరక్తితో పురుగుల మందు కలిపిన సోడా తాగి తర్వాత కుమారుడితో తాగించి ఆత్మహత్య కు పాల్పడింది. తీవ్ర అస్వస్థతకు గురైన తల్లి, కుమారుడిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో

భర్త మరణాన్ని తట్టుకోలేక బలవన్మరణం
భర్త గోపితో భార్య ఆకాంక్ష, కుమారుడు (ఫైల్‌ ఫొటో)

పురుగుల మందు తాగి రెండేళ్ల కుమారుడుకి పట్టించిన తల్లి

కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి

సర్పవరం జంక్షన్‌, సెప్టెంబరు 3 (ఆంధ్ర జ్యోతి): భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. అతడు లేని జీవితాన్ని ఊహించలేకపోయింది. రెండేళ్ల కుమారుడ్ని ఏ విధంగా పెంచి పెద్ద చేయాలో ఎంతో ఆలోచించింది.. చివరకు జీవితం పై విరక్తితో పురుగుల మందు కలిపిన సోడా తాగి తర్వాత కుమారుడితో తాగించి ఆత్మహత్య కు పాల్పడింది. తీవ్ర అస్వస్థతకు గురైన తల్లి, కుమారుడిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం ఇద్దరు మృతిచెందారు. ఈ విషాద సంఘటన కాకినాడ జిల్లా సర్పవరం శివారు గాంధీకాలనీలో జరిగింది. వివరాల్లోకెళితే కాకినాడ రూరల్‌ మం డలం సర్పవరం శివారు భావనారాయణపురం గాంధీకాలనీకి చెందిన జనపల్లి గోపి, ఆకాంక్ష (25) భార్యాభర్తలు. వారికి రెండేళ్ల కుమారుడు సార్విక్‌ ఉన్నాడు. భర్త మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కాంట్రాక్ట్‌ శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసేవాడు. కుమారుడి పుట్టిన రోజు వేడుక కోసం రూ.3 లక్షల అప్పు లు చేశాడు. అవి తీర్చలేక, ఒత్తిడి త ట్టుకోలేక జూలై 22న పురుగుల మం దు తాగి ఆత్మ హత్య చేసుకున్నాడు. భర్త చనిపోయిన దగ్గర నుంచి ఆకాం క్ష రోధిస్తూ తమ భవిష్యత్తుపై కల త చెంది మానసికంగా కుంగిపోయింది. అత్త, పుట్టింట్లో తలో పది రోజులు ఉండేది. ఇటీవలే పుట్టింటి నుంచి అత్తమామలు నివాసం ఉండే గాంధీ కాలనీకి వచ్చింది. భర్తను తలచుకుంటూ జీవితంపై విరక్తితో గతనెల 31న మధ్యాహ్నం 3 గంటల సమయంలో సోడాలో పురుగుల మందు కలిపి ముందు తాను తాగిన తర్వాత కుమారు డికి పట్టించింది. ఇద్దరూ తీవ్ర అస్వస్థతకు గురై పడి ఉండటాన్ని గమనించిన అత్త మామలు వెంటనే చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. అప్పటి నుంచి చికిత్స పొందు తోన్న తల్లి, కుమారురుడు ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున మృతిచెందినట్టు వై ద్యులు నిర్ధారించారు. మృతు రాలి తల్లి డోనం శాంతికుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్పవరం సీఐ బి.పెద్దిరాజు ఆదేశాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ నాగేశ్వరరావు తెలిపారు. మృతదేహాలకు పోస్టు మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగిం చినట్లు తెలిపారు. కుమారుడు, కోడలు, మనవ డు సు మారు 45 రోజుల వ్యవధిలో మరణిం చడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Updated Date - Sep 04 , 2025 | 12:55 AM