Share News

తల్లికి వందనం డబ్బులు అడిగినందుకు...

ABN , Publish Date - Jul 29 , 2025 | 12:35 AM

అమలాపురం టౌన్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): తల్లికి వందనం డబ్బులు ఏం చేశామని అడిగినందుకు భర్తపై భార్య కత్తిపీటతో దాడి చేసిన సంఘటన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోన సీమ జిల్లా అమలాపురం పట్టణ పరిధిలోని సావరం రోడ్డులో సోమవారం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పట్టణ ఎస్‌ఐ కిశోర్‌బా

తల్లికి వందనం డబ్బులు అడిగినందుకు...
దుర్గాప్రసాద్‌ నుంచి వివరాలు సేకరిస్తున్న ఎస్‌ఐ

భర్తపై భార్య కత్తిపీటతో దాడి

అమలాపురం టౌన్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): తల్లికి వందనం డబ్బులు ఏం చేశామని అడిగినందుకు భర్తపై భార్య కత్తిపీటతో దాడి చేసిన సంఘటన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోన సీమ జిల్లా అమలాపురం పట్టణ పరిధిలోని సావరం రోడ్డులో సోమవారం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పట్టణ ఎస్‌ఐ కిశోర్‌బాబు విలేకర్లకు వివరించారు. సావరంలో నివాసం ఉంటున్న పెనుమాల దుర్గాప్రసాద్‌కు భార్య దుర్గ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖతాల్లో తల్లికి వందనం డబ్బులు జమ చేసింది. అయితే ఆ సొమ్ములు ఏం చేశావని భర్త దుర్గాప్రసాద్‌ భార్య దుర్గను ప్రశ్నించాడు. దాంతో మాటామాటా పెరిగి దుర్గాప్రసాద్‌పై భార్య దుర్గ కత్తిపీటతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. భర్త దుర్గాప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్య దుర్గపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ కిశోర్‌బాబు తెలిపారు.

Updated Date - Jul 29 , 2025 | 12:35 AM