Share News

రక్షణకు వేద్దాం ‘టూ స్టెప్స్‌’

ABN , Publish Date - May 30 , 2025 | 11:49 PM

శంఖవరం, మే 30 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ జిల్లా శంఖవరం మండలం నెల్లిపూడికి చెందిన ఓ యువకుడికి ఇటీ వల వాట్సాప్‌ ద్వారా ఫోన్‌ వచ్చింది. హిందీలో మాట్లాడటంతో ఫోన్‌ కట్‌ చేశాడు యువకుడు. వెంటనే రూ.5 వేలు పంపాలని లేకపోతే నీ కాంటాక్ట్‌ లిస్టులో ఉన్నవాళ్లందరకీ నీ నగ్న ఫొటోలు పం పుతానని బెది

రక్షణకు వేద్దాం ‘టూ స్టెప్స్‌’

వాట్సాప్‌లో మార్చుకోవాల్సిన

సెట్టింగ్‌పై పోలీసుల అవగాహన

సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలని సూచన

శంఖవరం, మే 30 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ జిల్లా శంఖవరం మండలం నెల్లిపూడికి చెందిన ఓ యువకుడికి ఇటీ వల వాట్సాప్‌ ద్వారా ఫోన్‌ వచ్చింది. హిందీలో మాట్లాడటంతో ఫోన్‌ కట్‌ చేశాడు యువకుడు. వెంటనే రూ.5 వేలు పంపాలని లేకపోతే నీ కాంటాక్ట్‌ లిస్టులో ఉన్నవాళ్లందరకీ నీ నగ్న ఫొటోలు పం పుతానని బెదిరింపులు వచ్చాయి. భయంతో పోలీసులను ఆశ్రయించాడు యువకుడు. ఇలా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వందల సంఖ్యలో యువతీ, యువకులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు పోలీసులకు ఫిర్యాదులు చేస్తుంటే మరికొంతమంది భయ ంతో సైబర్‌ నేరగాళ్లు చెప్పినట్టు డబ్బులు పంపుతున్నారు. ఇంతకీ మనం ఫోన్‌లో ఉండే కాంటాక్ట్‌ లిస్టులో ఉన్న వివరాలు అవతలి వ్య క్తికి ఎలా వెళ్తాయే తెలుసా? వాట్సాప్‌లో ఉన్న ఓ సెట్టింగ్‌ ఆన్‌ చేసుకోకపోవడమే అందుకు కారణం. ఇదే సైబర్‌ దొంగలకు వరంగా మారింది. వాట్సాప్‌లో టూ స్టెప్‌ పిన్‌ యాక్టివేట్‌ చేసుకోని యువతను టార్గెట్‌గా చేసుకుని ఫోన్‌ కాల్‌ చేసి వారి కాంటాక్ట్‌ లిస్టులో వ్యక్తులకు మార్ఫింగ్‌ ఫొటోలతో బెదిరింపులకు దిగుతున్నారు దుండగులు. అయితే సెట్టింగ్‌లను మార్చుకోవాలని పో లీసులు అవగాహన కల్పిస్తున్నారు.

సెట్టింగ్‌ను మార్చుకోండిలా...

ఫ తొలుత వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి

ఫ ఖాతాపై క్లిక్‌ చెయ్యండి

ఫ టూ స్టెప్‌ ఆప్సన్‌పై క్లిక్‌ చేయండి

ఫ మీ పిన్‌ను నమోదు చెయ్యండి

ఫ మీ ఈమెయిల్‌ చిరునామా నమోదు చేసి సేవ్‌ చేయండి

అవగాహన ఉండాలి

ప్రతీ ఒక్కరూ సైబర్‌ క్రైమ్‌ పట్ల అవగాహన కలిగి ఉండాలి. వాట్సాప్‌ను వినియోగించే ప్రతీ ఒక్కరూ టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ చేసుకోవాలి. టూస్టెప్‌ పిన్‌ నమోదు చేసుకున్న వాట్సాప్‌ను హ్యాక్‌ చేయాలంటే వాట్సాప్‌ టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ అడుగుతుంది. ఓటీపీ లేకుండా వాట్సాప్‌ హ్యాక్‌చేయడం కుదరదు.

ప్రత్తిపాడు సీఐ బి. సూర్యఅప్పారావు

Updated Date - May 30 , 2025 | 11:49 PM