Share News

ఇదేంటి సారూ!

ABN , Publish Date - Oct 26 , 2025 | 11:55 PM

రాజమహేంద్రవరం నగరపాలక సం స్థ కార్యాలయంలో హౌస్‌ కీపింగ్‌ పనులను 11 మంది మహిళలు 2017 నుంచి చేస్తున్నారు. కా ర్యాలయం ప్రారంభోత్సవం సమయంలో అప్ప టి కమిషనర్‌ విజయరామరాజు ఆదేశాలతో 13 మంది మహిళలను కార్యాలయం శుభ్రం చేసేందుకు తీసుకున్నారు.

ఇదేంటి సారూ!
రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కార్యాలయంలో పనులు చేస్తున్న మహిళలు

  • రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో హౌస్‌కీపింగ్‌ వర్కర్లకు అన్యాయం

  • పీజీఆర్‌ఎస్‌లో మొరపెట్టుకున్నా పట్టించుకోని అధికారులు

  • లోపాయికార ఒప్పందంతో ఆటాడుకుంటున్న సెక్యూరిటీ గార్డ్స్‌ (కాంట్రాక్ట్‌)

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 26(ఆం ధ్రజ్యోతి): రాజమహేంద్రవరం నగరపాలక సం స్థ కార్యాలయంలో హౌస్‌ కీపింగ్‌ పనులను 11 మంది మహిళలు 2017 నుంచి చేస్తున్నారు. కా ర్యాలయం ప్రారంభోత్సవం సమయంలో అప్ప టి కమిషనర్‌ విజయరామరాజు ఆదేశాలతో 13 మంది మహిళలను కార్యాలయం శుభ్రం చేసేందుకు తీసుకున్నారు. ఈ పనులను కాంట్రాక్ట్‌ తీసుకున్న గుత్తెదారుడి ఆధీనంలో కార్పొరేషన్‌ కార్యాలయంలో హౌస్‌కీపింగ్‌ పనులు చేశారు. అటుపై మరో కాంట్రాక్టర్‌ ఆధీనంలో కొంతకా లం పనిచేశారు. ఇద్దరి ఆధీనంలో సుమారు ఏడేళ్ల పనిచేశారు. ఆరంభంలో నెలకు ఒక్కొక్కరి రూ.8,100 జీతం ఇచ్చేవారు. అటుపై కార్పొరేషన్‌లో సె క్యూరిటీ విధులు నిర్వహిం చే వారిలో ఓ వ్యక్తి ఈ హౌస్‌కీపింగ్‌ పనులు కాంట్రాక్టర్‌ నుంచి సబ్‌ లీజుకు తీ సుకుని కోతలు మొదలెట్టారు. వారికి ఇష్టం లేని వారిని తీ సేయడం, కొత్త వారిని తీసుకుని వారి నుంచి రూ.50 వేలు తీసుకోవడం వంటి ప నులు చేసి అడ్డగోలుగా వ్యవహరించారు. ఇలా మూడేళ్లపాటు పనులు జరిగాయి. ప్రస్తుతం నెలకు ఒక్కో మహిళకు రూ.15 వేలు వస్తుంది. అందులో వివిధ రూపాల్లో కటింగ్‌లు చేసి రూ.9 వేలు ఇస్తున్నారు. అయితే హౌస్‌కీపింగ్‌ చేసే మహిళలు కలిసి అంబేడ్కర్‌ హౌస్‌ కీపింగ్‌ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పు డు కాంట్రాక్టు గడువు ముగియడంతో హౌస్‌కీపింగ్‌ పనుల కాంట్రాక్టును తమకే ఇవ్వాలని రెం డు నెలలుగా అధికారులను అడుగుతున్నారు. అయితే కాంట్రాక్టర్‌ కాంట్రాక్ట్‌ గడువును నెలరోజుల పొడింగించి మరో పెద్దకాంట్రాక్టర్‌ను తెరమీదకి తెచ్చి సెక్యూరిటీ గార్డ్స్‌ కాంట్రాక్టర్‌కే సబ్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చే యోచనలో ఒక అధికారితో పావులు కదపడం మహిళలను ఆందోళనకు గురిచేస్తోంది. దీనిపై పీజీఆర్‌ఎస్‌లో విన్నవించినా దానిని పక్కదారి పట్టించారు. ఆపై ఎమ్మె ల్యే ఆదిరెడ్డి వాసు దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఏడేళ్లుగా పనిచేస్తున్న మహిళలకు అవకాశం ఇవ్వాలని అధికారులకు సూచించారు. అయితే అధికారులు మాత్రం పెద్ద కాంట్రాక్టర్‌కు ఈ కాంట్రాక్ట్‌ను కట్టబెట్టాలని ప్రయత్నించడం విమ ర్శలకు తావిస్తోంది.ఇప్పటికైనా కమిషనర్‌ రాహుల్‌మీనా దీనిపై స్పందించి ఏడేళ్లుగా హౌప్‌కీపింగ్‌ పనులు చేసుకుంటున్న తమకు న్యాయం చేయాలని మహిళలు ఎదురు చేస్తున్నారు.

Updated Date - Oct 26 , 2025 | 11:55 PM