Share News

సంక్షేమ ఫలాలు అర్హులందరికీ చేరాలి

ABN , Publish Date - Jul 20 , 2025 | 12:57 AM

ప్రభు త్వ సంక్షేమ ఫలాలు అర్హులందరికీ చేర్చడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆకాంక్షించారు. ఈమేరకు శనివారం రాజమహేంద్రవరంలోని తన కార్యాల యంలో రాజానగరం నియోజకవర్గ అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరుపై పలు శాఖల అధికారులతో సమీక్షించారు.

సంక్షేమ ఫలాలు అర్హులందరికీ చేరాలి
అధికారుల సమీక్షలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బత్తుల

  • చిత్తశుద్ధితో వ్యవహరించాలి

  • వివిధ శాఖల అధికారులతో సమీక్షలో ఎమ్మెల్యే బత్తుల

రాజానగరం, జూలై 19(ఆంధ్రజ్యోతి): ప్రభు త్వ సంక్షేమ ఫలాలు అర్హులందరికీ చేర్చడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆకాంక్షించారు. ఈమేరకు శనివారం రాజమహేంద్రవరంలోని తన కార్యాల యంలో రాజానగరం నియోజకవర్గ అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరుపై పలు శాఖల అధికారులతో సమీక్షించారు. ప్రజ ల ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పక్కా ప్రణాళికలతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాజానగరం మండలంలోని కలవచర్లలో 104 ఎక రాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఇండస్ట్రియల్‌ పార్క్‌ మరో వారం, పది రోజుల్లో ప్రారంభోత్సవానికి సి ద్ధం చేస్తున్నామన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహాయ సహ కారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. డీఆర్‌డీఏ, సెర్ప్‌ అధికారులు, సిబ్బం దితో జరిగిన సమీక్షలో ఎమ్మెల్యే మా ట్లాడుతూ ఫీల్డ్‌ స్థాయి సిబ్బంది తమ పనితీరు మార్చు కోకుంటే చర్యలు తప్పవని హెచ్చరిం చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులకు అందేలా చూడాల న్నారు. అలాగే ఎక్సైజ్‌శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో మాట్లాడుతూ నియోజకవర్గంలో బెల్టు షాపుల నిర్వహణపై ఉక్కుపాదం మోపాలన్నా రు. సారా తయారీ,విరివిగా విక్రయిస్తున్న ప్రాం తాలను గుర్తించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ, నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. గం జాయి, మాదకద్రవ్యాల నిర్మూలనలో చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.సమావేశాల్లో ఆ యా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

  • జనసేనలో చేరికలు

కోరుకొండ, జూలై 19(ఆంధ్రజ్యోతి): మండ లంలోని కోటికేశవరం గ్రామానికి చెందిన సుమారు 100 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం జనసేన పార్టీలోకి చేరారు. వారికి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గాన్ని శరవేగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే బత్తుల పనితీరును చూసి తాము జనసేనలో చేరినట్టు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు అడ్డాల శివ, నాతిపాము దొరబాబు, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2025 | 12:57 AM