Share News

అభివృద్ధి దిశగా..

ABN , Publish Date - Jun 13 , 2025 | 01:33 AM

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న తరుణంలో జిల్లాలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ వెల్లడించారు. జిల్లాలో వివిధ కేటగిరిల్లో పెన్షన్ల వారీగా గత ప్రభుత్వం 18 కేటగిరిల్లో మార్చి 2024 వరకు ప్రతీ నెల రూ.71.33 కోట్లు చెల్లిస్తే, ప్రస్తుత ప్రభుత్వం ఏప్రిల్‌ 2024 నుంచి ఇప్పటివరకు 28 కేటగిరిల్లో ప్రతీ నెల రూ.101.15 కోట్లు పంపిణీ చేసినట్టు చెప్పారు.

అభివృద్ధి దిశగా..
కలెక్టర్‌ మహేష్‌కుమార్‌

  • జిల్లాలో సాధించిన ప్రగతి ఇది : జిల్లా కలెక్టర్‌

అమలాపురం, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న తరుణంలో జిల్లాలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ వెల్లడించారు. జిల్లాలో వివిధ కేటగిరిల్లో పెన్షన్ల వారీగా గత ప్రభుత్వం 18 కేటగిరిల్లో మార్చి 2024 వరకు ప్రతీ నెల రూ.71.33 కోట్లు చెల్లిస్తే, ప్రస్తుత ప్రభుత్వం ఏప్రిల్‌ 2024 నుంచి ఇప్పటివరకు 28 కేటగిరిల్లో ప్రతీ నెల రూ.101.15 కోట్లు పంపిణీ చేసినట్టు చెప్పారు. దీపం పథకం కింద 5.37 లక్షల మంది కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ మొత్తాన్ని 48 గంటల్లోనే లబ్ధిదారుల ఖాతాకు జమ చేస్తున్నామన్నారు. ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా జిల్లాలో 159 పనులతో గుంతల రహిత రహదారుల నిర్మాణానికి రూ.38 కోట్లు కేటాయించగా, దీంతో 643.29 కిలోమీటర్ల మేర ప్రధాన రోడ్ల మరమ్మతులు, అభివృద్ధి చెందాయి. రూ.4 కోట్లతో అమలాపురం పట్టణ, నడిపూడి వద్ద రెండు వంతెనల నిర్మాణం జరుగుతున్నాయి. నాబార్డు విడుదల చేసిన రూ.4.22 కోట్లతో రెండు రోడ్ల పనులు చేపట్టామన్నారు. రబీ, ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం సేకరణ చేపట్టి రైతులకు మద్దతు ధర కల్పించామన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పాఠశాలలు, హాస్టల్‌ విద్యార్థులకు నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో 62 హాస్టళ్లలో నాణ్యమైన 25 కిలోల బియ్యం వంతున 2,473 ప్యాకెట్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. 1534 పాఠశాలల్లో 7,221 బియ్యం ప్యాకెట్లు పంపిణీ చేశామన్నారు. పీఎం గ్రామీణ సడక్‌ యోజన పథకం కింద రూ.13.52కోట్ల అంచనా వ్యయంతో రెండు పనులు చేపట్టామన్నారు. ఎస్డీఎంఎఫ్‌ పథకంలో రూ.4.40 కోట్ల అంచనాతో మూడు పనులు చేపట్టి 7.30 కిలోమీటర్ల పొడవునా రోడ్డు నిర్మాణం చేపట్టామని ఆయన తెలిపారు.

Updated Date - Jun 13 , 2025 | 01:33 AM