Share News

ఉప్పాడ ఉప్పొంగే..

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:17 AM

కొత్తపల్లి, ఆగస్టు 10 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ జిల్లా కొత్తపల్లి ఉప్పాడ తీరంలో సముద్రం ఆ దివారం మళ్లీ ఉప్పొంగింది. దీంతో మాయాపట్నంలో మత్స్య కారుల ఇళ్లల్లోకి కెరటాలు రావ డంతో బిందెలు, దాకలు, ఇతర వంటసామగ్రి సముద్రంలో కొట్టుకుపోయాయి. పౌర్ణమి కార ణంగా సముద్ర కెరటాలు ఉవ్వె త్తున ఎ

ఉప్పాడ ఉప్పొంగే..
ఉప్పాడ మాయాపట్నంలో మత్స్యకారుల ఇళ్లల్లోకి చేరిన నీరు

మత్స్యకారుల ఇళ్లల్లోకి సముద్ర కెరటాలు

అవస్థలు పడుతున్న మత్స్యకారులు

కొత్తపల్లి, ఆగస్టు 10 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ జిల్లా కొత్తపల్లి ఉప్పాడ తీరంలో సముద్రం ఆ దివారం మళ్లీ ఉప్పొంగింది. దీంతో మాయాపట్నంలో మత్స్య కారుల ఇళ్లల్లోకి కెరటాలు రావ డంతో బిందెలు, దాకలు, ఇతర వంటసామగ్రి సముద్రంలో కొట్టుకుపోయాయి. పౌర్ణమి కార ణంగా సముద్ర కెరటాలు ఉవ్వె త్తున ఎగసిపడుతున్నాయి. సుమారు 15రోజుల కిందట అమావాస్య కారణంగా సముద్రం ఉప్పొ ంగడం, సుమారు 10 మత్స్యకార ఇళ్లు కొట్టుకు పోవడం విధితమే. గతంలో మాయాపట్నం గ్రామానికి జియోట్యూబ్‌ రక్షణ కవచంలా ఉండే ది. ప్రస్తుతం ఇక్కడ జియోట్యూబ్‌ ఆనవాలు లేకుండా కొట్టుకుపోవడంతో రోజు సముద్రంలో ఏర్పడే పోటుపాట్లకు... అలాగే అమావాస్య, పౌర్ణమిరోజుల్లోను, అల్పపీడనాలు ఏర్పడే సంద ర్భాల్లో కెరటాల ధాటికి నష్టపోయేది మాయాప ట్నం గ్రామం కావడంతో మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సముద్రకోత నుంచి రక్షించే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Updated Date - Aug 11 , 2025 | 12:17 AM