Share News

నీటి ఎద్దడిని అధిగమించండి

ABN , Publish Date - Mar 16 , 2025 | 11:52 PM

ప్రస్తుత వేసవిలో గ్రామాల్లో తాగు నీటి ఎద్దడి లేకుండా అధికారులు, పంచాయతీ కార్యదర్శులు చర్యలు చేపట్టాలని ఎంపీడీవో జేఏ ఝాన్సీ సూ చించారు. రాజానగరం మండల పరిషత్‌ సాధా రణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ మండారపు సీతారత్నం అధ్యక్షతన ఆదివారం వాడిగా వేడి గా జరిగింది.

నీటి ఎద్దడిని అధిగమించండి
సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీడీవో ఝాన్సీ

  • రాజానగరం ఎంపీడీవో ఝాన్సీ

  • అభివృద్ధి పనులపై సమాచారం ఇవ్వడం లేదు: సర్పంచ్‌లు

  • వాడీవేడిగా మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం

రాజానగరం, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత వేసవిలో గ్రామాల్లో తాగు నీటి ఎద్దడి లేకుండా అధికారులు, పంచాయతీ కార్యదర్శులు చర్యలు చేపట్టాలని ఎంపీడీవో జేఏ ఝాన్సీ సూ చించారు. రాజానగరం మండల పరిషత్‌ సాధా రణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ మండారపు సీతారత్నం అధ్యక్షతన ఆదివారం వాడిగా వేడి గా జరిగింది. ఈ సమావేశంలో వైసీపీకి చెందిన రాజానగరం, పుణ్యక్షేత్రం, తోకాడ, కొత్తతుంగ పాడు సర్పంచ్‌లు కుందేటి ప్రసాద్‌, మరుకుర్తి వెంకటేశ్వరరావు, వేగిశెట్టి పోతురాజు, కోలపాటి వెంకన్న తదితరులు మాట్లాడుతూ తమ గ్రా మాల్లో ప్రభుత్వ నిధులతో చేపడుతున్న అభి వృద్ధి పనులపై సంబంధిత అధికారులు తమకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని ఆరోపిం చారు. దీనిపై ఎంపీడీవో ఝాన్సీ స్పందిస్తూ గ్రామాల్లో జరిగే అభివృద్ది పనుల సమాచారాన్ని సంబంధిత సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు తెలియజేసేలా చర్యలు చేప డతామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు కల్పిస్తు న్న సౌకర్యాలపై స్థానిక స ర్పంచ్‌ కుందేటి ప్రసాద్‌ సూ పర్‌వైజర్‌ దుర్గామణిని ప్ర శ్నించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని ఆయాలను కార్యాలయాలకు తీసుకొచ్చి పనిచేయించుకో వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత లోపిస్తోందని తాను ఇటీవల ఒక కేంద్రాన్ని సందర్శించిన సమయంలో అక్కడ దుర్వాసన వచ్చిందన్నారు. గర్భిణులకు అంగన్‌వాడీ కేంద్రాల సరఫరా చేస్తున్న చోడిపిండిలో నాణ్యతలోపిస్తుందని అధి కారుల దృష్టికి తెచ్చారు. దీనిపై సూపర్‌వైజర్‌ దుర్గామణి మాట్లాడుతూ ప్రభుత్వం పోషణ వాటికి అమలుచేస్తోందని, దీని నిమిత్తం అప్పు డప్పుడు ఆయాలు కార్యాలయం వద్దకు వస్తు న్నారన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ అవినాష్‌ మా ట్లాడుతూ నియోజకవర్గంలోని రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాలతో పాటు గోకవరం, రంగంపేట మండలాలకు సంబంధిం చి గోదావరి జలాలను తాగునీటిగా అందించేం దుకు రూ.689 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు నివేదించామన్నారు. అలాగే చక్రద్వారబంధం గ్రామా నికి మంచినీటి బోరు ఏర్పాటు నిమిత్తం జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి రూ.16.50 లక్షలు నిధులను మంజూరు చేశార న్నారు. గత ప్రభుత్వంలో జగనన్న హౌసింగ్‌ కాలనీలకు లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ సదరు లబ్ధిదారుల జాబితాలను మారుస్తున్నట్లు గ్రామాల్లో ప్రచారం జరుగుతోం దని పుణ్యక్షేత్రం సర్పంచ్‌ అఽధికారుల దృష్టికి తెచ్చారు. పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ స భ్యులు మాట్లాడుతూ రీసర్వే చేసే సమయంలో సరిహద్దు రైతులకు సమాచారం ఇవ్వడం లేదని తహశీల్దార్‌ దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో మండల పరిషత్‌ ఏవో సుబ్రహ్మణ్యం, సెర్ప్‌ ఏపీ ఎం గుమ్మడి సునీత, హౌసింగ్‌ ఏఈ రామా రావు, పంచాయతీరాజ్‌ ఏఈ సంప త్‌కుమార్‌, వైస్‌ ఎంపీపీ కొల్లి సత్యశ్రీ, కోడి రాఘవ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 11:52 PM