Share News

వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు

ABN , Publish Date - Apr 11 , 2025 | 01:03 AM

ని యోజకవర్గంలోని తాగునీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు.

వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు

పి.గన్నవరం, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): ని యోజకవర్గంలోని తాగునీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు. ముంగండ తాగునీటి ప్రాజెక్టు వద్ద రూ.25లక్షలతో ఏర్పాటుచేసిన మైక్రో ఫిల్టర్‌ను ఆయన ప్రారం భించారు. తాగునీరందని గ్రామాల్లో ట్యాంకుల ద్వారా నీరందించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కేవీ ప్రసాద్‌, ఎంపీపీ గనిశెట్టి నాగలక్ష్మి, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ పి.రవీంద్రబాబు, జెఈ కల్యాణ చక్రవర్తి, సర్పంచ్‌ కుసుమ చంద్రకళ, ఎంపీటీసీలు అంబ టి భూలక్ష్మి, పులపర్తి వెంకటలక్ష్మి, ఆదిమూలం సూరయ్యకాపు, సర్పంచ్‌లు తోలేటి బంగారునాయుడు, వీరవెంకట సత్యనారాయణ, కూటమినాయకులు పాల్గొన్నారు. నరేంద్రపురం సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌ను జేఈ జీవీ ఆచార్యులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రారంభించారు.

Updated Date - Apr 11 , 2025 | 01:03 AM