Share News

ఎత్తిపోస్తారు!

ABN , Publish Date - Jul 18 , 2025 | 12:48 AM

ర్వీర్యమైన చిన్న నీటిపారుదల వ్యవస్థను బతికించ డానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ఆరంభించింది. ఓ ప్రైవేట్‌ కార్పొరేట్‌ సంస్థకు మరమ్మ తులు, నిర్వహణ బాధ్యత అప్పగించనుంది.

ఎత్తిపోస్తారు!
కట్టమూరు ఎత్తిపోతల పథకం

ఉమ్మడి జిల్లాలో 28 పథకాలు

కార్పొరేట్‌కు నిర్వహణ బాధ్యత

రూ.600 కోట్లతో ప్రతిపాదన

వైసీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యం

ఏజెన్సీలో 50 పథకాల మూత

కూటమి ప్రభుత్వం దృష్టి

కొత్త పద్ధతికి శ్రీకారం

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

నిర్వీర్యమైన చిన్న నీటిపారుదల వ్యవస్థను బతికించ డానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ఆరంభించింది. ఓ ప్రైవేట్‌ కార్పొరేట్‌ సంస్థకు మరమ్మ తులు, నిర్వహణ బాధ్యత అప్పగించనుంది. ఉభయగో దావరి జిల్లాల్లో మెట్ట ప్రాంతంలోని 48 ఎత్తిపోతల పథ కాల మరమ్మతులు, నిర్వహణకు రూ.600 కోట్లతో అధి కారులు అంచనాలు సిద్ధంచేశారు. గత వైసీపీ హయాం లో చిన్న నీటిపారుదల వ్యవస్థ పూర్తిగా అవస్థలకు గురైంది. ఇప్పటికే ఏజెన్సీలో 70 ఎత్తిపోతల పథకాలు మూతపడ్డాయి. దీంతో వాటిని వదిలేశారు. కాలువల ద్వారా నీటి సరఫరా లేని మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో సాగునీరు సరఫరా చేయడానికి 1974లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నీటిపారుదల సంస్థ ఏర్పడింది. కనీసం 50 నుంచి 5 వేల ఎకరాల వరకూ ఉన్న భూములకు ప్రభుత్వం ఒక్కొక్క ఎత్తిపోతల పథకం నిర్మించి రైతులకు అప్పగిం చేది. వాటికి ఉచిత కరెంట్‌ ఇచ్చేది. వాటి నిర్వహణ రైతులు చేసుకోవాలి. దీని కోసం 11 మంది సభ్యులతో కూడిన రైతు కమిటీ ఉండేది. రైతుల నుంచి ఎకరాకు రూ.500 నుంచి రూ.1000 వరకూ ఏడాదికి వసూలు చేసి ఎత్తిపోతల పథకాలు నిర్వహణ చూసేవారు. ఇలా చాలా కాలం నడిచిన పథకాలను వైసీపీ పూర్తిగా నిర్వీ ర్యం చేసింది. దీంతో చాలాచోట్ల రైతులు వదిలేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 101 ఎత్తిపోతల పథ కాలు ఉండేవి. 37,450 ఎకరాల ఆయకట్టు ఉండేది. పోలవరం ప్రాజెక్టు ముంపు కారణంగా ఏజెన్సీ ప్రాం తాల్లో 50 ఎత్తిపోతల పథకా లను పనిచేయడంలేదు. మరో 20 పథకాలు నిర్వీర్య మయ్యాయి. ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాల పరిధిలో ఉన్న 48 ఎత్తిపోతల పథకాలను రైతుల నుంచి తప్పించి కార్పొరేట్‌ సంస్థకు ఇచ్చి వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఉమ్మడి జిల్లాలో 28 పథకాలు..

ఫ తూర్పుగోదావరి జిల్లాలో 10 పథకాలు పాక్షికంగా పనిచేస్తున్నాయి. కొవ్వూరు నియోజకవర్గంలో కుమార దేవం, బ్రాహ్మణగూడెం, చాగల్లు, వేగేశ్వరపురం, పైడి మెట్ట-1, నిడదవోలు, అనపర్తిలో పి.బి.దేవం-1,2, కాపవ రం,సీతానగరం మండలం కాటవరం ఉన్నాయి.23,745 ఎకరాల ఆయకట్టు ఉంది. మరమ్మతులు,నిర్వహణకు రూ.195 కోట్ల 60 లక్షలతో అంచనాలు పంపించారు.

ఫ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 4 పథకాలున్నాయి. రాజోలు, కొత్తపేట నియోజకవర్గాల్లో చింతలమోరి, వసంతవాడ ఉన్నాయి. మొత్తం 4,970 ఎకరాల ఆయ కట్టు ఉంది. మరమ్మతులు, నిర్వహణకు రూ.34 కోట్ల 8 లక్షల 37వేలతో అంచనాలు సిద్ధంచేశారు. రామచంద్ర పురం నియోజకవర్గంలో పల్లిపాలెం-1,2 పథ కాలున్నా యి. 927 ఎకరాల ఆయకట్టు ఉంది. మరమ్మతులు, ని ర్వహణకు రూ.3.48 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు.

ఫ కాకినాడ జిల్లాలో 14 ఎత్తిపోతల పథకాలు ఉన్నా యి. పెద్దాపురం నియోజకవర్గంలోని వేట్లపాలెం, కట్ట మూరు, కట్టమూరుమినీ, పెద్దాపురం-1,2, జి.మేడపా డు, పెదబ్రహ్మదేవం-3, కాకినాడ రూరల్‌లో వేముల వాడ-2, పెద్దాపురపాడు, గొర్రిపూడి, వేములవాడ- అన పర్తి నియోజకవర్గం పరిధి పెదపూడి, దోమాడ, జగ్గం పేట నియోజకవర్గంలో సోమవరం పథకాలున్నాయి. 13,710 ఎకరాల ఆయకట్టు ఉంది. మరమ్మతులు, నిర్వ హణకు రూ.122కోట్ల 25లక్షల 32వేలు అంచనా వేశారు.

Updated Date - Jul 18 , 2025 | 12:48 AM