చెల్లింపులకు నీళ్లు!
ABN , Publish Date - Jul 19 , 2025 | 01:42 AM
గోదావరి నీటితో కొన్ని కంపెనీలు కాకినాడలో అడ్డంగా వ్యాపారం చేసేస్తు న్నాయి. ప్రభు త్వం నుంచి కారుచౌకగా నీటిని కొట్టేస్తూ కోట్లకు కోట్లు వెనకేసుకుం
నీళ్లతో దర్జాగా వ్యాపారం
కారుచౌకగా నీళ్లు
పరిశ్రమలు,పోర్టులకు విక్రయం
కోట్లలో సంపాదన
ఛార్జీలు కట్టకుండా ఎగనామం
రూ.45.50 కోట్ల బాకీలు
కలెక్టర్ ఆగ్రహంతో నోటీసులు
(కాకినాడ,ఆంధ్రజ్యోతి) : గోదావరి నీటితో కొన్ని కంపెనీలు కాకినాడలో అడ్డంగా వ్యాపారం చేసేస్తు న్నాయి. ప్రభు త్వం నుంచి కారుచౌకగా నీటిని కొట్టేస్తూ కోట్లకు కోట్లు వెనకేసుకుం టున్నాయి. గోదావరి నీటిని పైపులైన్ల ద్వారా తీసుకుని వాటిని అనేక పరిశ్ర మలు, పోర్టు, నౌకలకు అమ్ముకుంటూ అడ్డంగా గడిస్తున్నా.. ప్రభుత్వానికి కట్టాల్సిన నామమాత్రపు ఛార్జీలు కట్టడానికి ససే మిరా అంటున్నాయి. రెండేళ్ల తరబడి ఇదే తంతు.అడగాల్సిన అధికారులేమో మనకెందుకులే అని వదిలేయడంతో వీరి ఆట లకు అంతులేకుండా పోతోంది. వెరసి ప్రభు త్వానికి రూ.45.50 కోట్ల మేర ఆదా యానికి గండి పడింది. నీటి సరఫరాలో కోత వేస్తే దారికి వచ్చే అవకాశం ఉన్నా అధికారులు సాహసించకపోవడంతో సదరు కంపెనీలు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
అంతా మా ఇష్టం...
కాకినాడ చుట్టుపక్కల అనేక భారీ పరిశ్ర మలు ఉన్నాయి.ఆ పక్కనే కాకినాడ సీపోర్టు కూడా ఉంది. పరిశ్రమలు,పోర్టుకు నిరంతరం నీళ్లు అవసరం. ఈ నీటిని పబ్లిక్ హెల్త్ అండ్ ఇంజనీరింగ్ విభాగం సామర్లకోటలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకు ద్వారా అందిస్తోంది. ప్రభుత్వం నేరుగా ఆయా సంస్థలకు నీటిని సరఫరా చేయ కుండా ప్రైవేటు కంపెనీలకు తక్కువ ధరకు విక్రయిస్తోంది. ఈ నీటిని నామమాత్రపు ధరకు కొనుగోలు చేసి ఎక్కువ రేటుకు విక్రయించి సొమ్ము చేసుకుంటాయి. ఒకరకంగా చెప్పాలంటే లీటర్ రూ.10 చొప్పున ప్రభుత్వం విక్రయిస్తే ఆ నీటిని పైపైన శుద్ధి చేసి ఆ కంపెనీలు రూ.30కి పైగా పరిశ్రమలకు అమ్ముకుంటున్నాయి. ఇలా అమ్మే నీళ్లకు ఒక్కో కంపెనీ నెలకు రూ.40 లక్ష ల వరకు లాభాలు పొందుతున్నాయి. కానీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన బాకీలు కట్టడానికి చేతులు రావడం లేదు. అటు అధికారులు పట్టించుకోవడం లేదు. నీటిని కొనుగోలు చేసి విక్రయిస్తోన్న కంపెనీలు దాదాపుగా అన్నీ రాజ కీయనేతలు, పలుకుబడి ఉన్న సంస్థలు కావ డంతో వాటి జోలికి పదకొండేళ్లుగా వెళ్లడం లేదంటే ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. కంపెనీలు సైతం బాధ్యతగా ప్రభుత్వానికి నీటి ఛార్జీలు చెల్లించడానికి ఇష్టపడడం లేదు.
నోటీసులిచ్చినా..
రూ.45.50 కోట్లకుపైగా బాకీలు పెరిగిపో యినా అఽధికారులు మాత్రం ఈ కంపెనీలకు నీటి సరఫరా నిలిపివేయకుండా ఎంచక్కా సర ఫరా చేస్తూనే ఉన్నారు. దీంతో ఆయా సంస్థలు సైతం దర్జాగా అడ్డగోలుగా వ్యాపారం చేసు కుంటూ కోట్లలో సంపాదించుకుంటున్నాయి. ఇటీవల జిల్లా కలెక్టర్ శాన్‌మోహన్ దృష్టికి ఈ వ్యవహారం వెళ్లడంతో అధికారులపై సీరియస్ అయ్యారు. 14రోజుల్లోగా బాకీలు చెల్లించాలం టూ కంపెనీలకు నోటీసులు పంపించారు. కానీ ఒక్క ఎన్‌ఎఫ్‌సీఎల్ మినహా మిగిలినవేవీ కనీసం స్పందించలేదు. ఇదిలా ఉండగా ‘‘ద్వారంపూడి దర్జా’’ అంటూ ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో కథనం రావడంతో అధికా రులు స్పందించారు. బకాయిలు ఎగ్గొట్టిన అన్ని కంపెనీలకు శుక్రవారం రెండో విడత నోటీసులు జారీచేశారు. 14 రోజుల్లోగా స్పందించకపోతే నీటి సరఫరా నిలిపివేయాలని నిర్ణయుంచారు.
ఐదు కంపెనీలు..
ప్రధానంగా ఐదు కంపెనీలు పదకొండేళ్లుగా కట్టాల్సిన బాకీలు ఏకంగా రూ.44 కోట్ల వరకు పేరుకుపోయాయి. కాకినాడ సీపోర్టు (కేఎస్‌పీ ఎల్) రూ.13.17 కోట్లు బాకీలు చెల్లించలేదు. ఈ సంస్థ 0.75 ఎంజీడీ గోదావరి నీటిని తీసుకుని సొంత అవసరాలకు,నౌకలకు విక్రయి స్తోంది. 2016 ఏప్రిల్ 25 నుంచి మే 31 వరకు కలిపి ప్రభుత్వానికి రూ.13.17 కోట్ల బాకీలు కట్టలేదు. అధికారంలో ఉన్న ఓ రాజకీయ నేతకు చెందిన అన్నపూర్ణ మెరైన్స్ కంపెనీ 0.25 ఎంజీడీ నీటిని తోడుకుంటూ పరిశ్రమ లకు అమ్ముకుంటోంది.ఈ కంపెనీ 2018 ఫిబ్ర వరి 2 నుంచి ఈ ఏడాది మే 31 వరకు కలిపి ప్రభుత్వానికి రూ.9.12 కోట్లు బాకీ పడింది. మాజీ ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణకు చెందిన ముత్తా శశిధర్ అండ్ కో కంపెనీ 0.1 ఎంజీడీ నీటిని తీసుకుంటూ 2019 డిసెంబర్ నుంచి రూ.2.73 కోట్ల బాకీలు చెల్లిం చడం లేదు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారం పూడికి చెందిన అంజనీ ఏజెన్సీస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఏకంగా 2014 ఏప్రిల్ 18 నుంచి ఈ ఏడాది మే 31 వరకు రూ.13.84 కో ట్లు బాకీ పడింది. ఈయనకు భయపడి అధికారులు అసలు కం పెనీ జోలికే వెళ్లలేదు.అశోకా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ 0.20 ఎంజీడీ నీటిని తీసుకుంటూ 2020 జనవరి నుంచి ఈ ఏడాది మే 31 వరకు రూ.5.39 కోట్లు నీటి ఛార్జీలు చెల్లించకుండా ఎగ్గొట్టేసింది.నాగార్జున ఎరు వు ల కర్మాగారం 9ఎంజీడీల నీటిని తీసుకుం టూ గతేడాది జూన్ 1 నుంచి ఈఏడాది మే 31 వర కు రూ.1.47 కోట్ల బాకీలు చెల్లించడం లేదు.