Share News

పోనీళ్లే.. అనుకోవద్దు!

ABN , Publish Date - Dec 12 , 2025 | 12:23 AM

పర్యవేక్షణను గాలికొదిలేసిన అధికారులు జరిమానాలకు పరిమితం కావడంతో రైల్వే ప్రయాణికుల జేబులకు లక్షల్లో చిల్లు పడు తోంది.

పోనీళ్లే.. అనుకోవద్దు!
రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌

రైల్వే ధర రూ.14

వ్యాపారుల ధర రూ.20

అదనంగా రూ.6 లాగుడు

ప్రయాణికుల నుంచి దోపిడీ

మిగిలిన వస్తువులదీ అదే పరిస్థితి

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

నా పేరు అల్లావుద్దీన్‌ మల్లిక్‌.. మాది హౌరా.. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బీ3 బోగీలో చెన్నై వెళు తున్నా. రాజమండ్రి రైల్వే స్టేషనులో రైలు ఆగిన సమయంలో ప్లాట్‌ఫాంపై ఉన్న స్టాల్‌కి వెళ్లి వాటర్‌ బాటిల్‌ కొన్నా. నా దగ్గర రూ.20 తీసుకున్నాడు.నేను ప్రశ్నిస్తే చిల్లర వెతుకు తు న్నట్టు నటించాడు. ఈలోపు రైలు కదిలే సమ యం కావడంతో చిల్లర వదులుకున్నా. రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో చాలా మంది ప్రయాణికులది ఇదే పరిస్థితి. వాటర్‌ బాటిల్‌పైనే కాదు.. ఏ వస్తువైనా అదనమే. దృష్టిపెట్టాల్సిన అధికారులు చూసీచూడకుండా వదిలేయడంతో ఇష్టానుసారం దోచేస్తున్నారు.

పర్యవేక్షణను గాలికొదిలేసిన అధికారులు జరిమానాలకు పరిమితం కావడంతో రైల్వే ప్రయాణికుల జేబులకు లక్షల్లో చిల్లు పడు తోంది. అధికారులు వస్తే జరిమానా పుచ్చుకొని వెళ్లిపోతారులే అనే చులకన భావంతో వ్యాపా రులు అదనపు ధరలతో ఇష్టారాజ్యంగా దోచేస్తు న్నారు. రైలు ఎక్కే హడావుడిలో ప్రయాణికుల కు ప్రశ్నించే అవకాశం ఉండడం లేదు. విజయవాడ డివిజన్‌లో విజయవాడ తర్వాత ముఖ్యమైన రైల్వే స్టేషన్‌ రాజమండ్రి. ప్రతి రోజూ 120 వరకూ రైళ్లు నడుస్తుండగా రోజుకు సరాసరిన 35 వేల మంది ప్రయాణికులు రాక పోకలు సాగిస్తారు. పండుగలు, పర్వదినాలు, సెలవుల వేళ ఆ సంఖ్య 50 వేల వరకూ ఉంటోంది. ఈ స్టేషను ఆదాయం ఎన్‌ఎస్‌జీ2 హోదాను తెచ్చిపెట్టింది.రాజమండ్రి రైల్వే స్టేషన్‌ లో రోజూ అధికారులు పదుల సంఖ్యలో ప్లాట్‌ ఫాంపై తిరుగుతున్నా యథేచ్ఛగా ధరల దోపిడీ జరుగుతోంది. రైల్వే శాఖ తగ్గింపు ప్రయాణికుల జేబుకు చేరడం లేదు.వాటర్‌ బాటిల్‌పై ఏకంగా 50 శాతం వరకూ అదనంగా లాగేస్తున్నారు.

అనధికారిక పెంపు

వాటర్‌ బాటిల్‌ ధర బయట దుకాణాల్లో రూ.20కి విక్రయిస్తారు. ప్రయాణికులకు సదుపాయాల్లో భాగంగా రైల్వే స్టేషన్లు, రైళ్లలో ఆ బాటిల్‌ని రాయితీపై రూ.15 కి అందిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరు 22 నుంచి మరో రూపాయి తగ్గించి రూ.14 చేసింది. అయితే ఈ ధర ప్రకటనలకు, బోర్డులకే పరిమితమైంది. అనధికారికంగా అధికారిక ధరపై రూ.6 (50ు) పెంచేసి రూ.20కి విక్రయిస్తున్నారు. బయట ధర కూడా రూ.20 కావడం, రైలు ఎక్కే హడావుడిలో ప్రయాణి కులు ఉండడం వ్యాపారులకు కలిసి వస్తోంది. రైలు నుంచి దిగి వాటర్‌ బాటిల్‌ కొనుగోలు చేసి ఆ ధరను ధరల పట్టికలో గుర్తు పట్టాలంటే భూతద్దం కావా ల్సిందే. ఎందుకంటే ధరల పట్టికలు అంతటి చిన్న అక్షరాలతో ఉన్నాయి. పోనీ ప్లాట్‌ఫాంపై ఉన్న ప్రయాణికులు ప్రశ్నిస్తే చిల్లర లేదని, చిల్లర తెచ్చుకోమని దుకాణదారులు ఉద్దేశపూ ర్వకంగా ఇబ్బంది పెడుతున్నారు. పలు దుకాణాదారులు వివిధ చేష్టలతో ధరల పట్టి కలు మూసేస్తున్నారు.రోజుకు ఈ రైల్వే స్టేష న్‌లో 3 వేల వాటర్‌ బాటిల్స్‌ వరకూ అమ్ము డవుతాయి. వేసవిలో అయితే ఆ సంఖ్య 10 వేలు ఉంటుంది. ఒక్కో బాటిల్‌పై రూ.6 అద నంగా వసూలు చేస్తున్నారు.ఈ లెక్కన రోజుకు రూ.20 వేలు, నెలకు రూ.6 లక్షలు, ఏడాదికి రూ.72 లక్షల వరకూ ప్రయాణికుల జేబుకు కన్నం వేస్తున్నారు. వేసవిలో ఈ సంఖ్య అధనమే. ధరలు పర్యవేక్షిస్తూ తనిఖీలు చేయా ల్సిన అధికా రులు అలా చేయడంలేదు.

Updated Date - Dec 12 , 2025 | 12:23 AM