అద్దెల పేరుతో దుబారా!
ABN , Publish Date - May 15 , 2025 | 01:38 AM
వృథాను అరికడితే పొదుపు చేసినట్టేనని పెద్ద లు చెబుతుంటారు. నిజమే ఆర్థిక పరిస్థితి బాగోని సమయంలో ఆ మాటను పక్కాగా పాటించకపోతే ఇంకా ఇబ్బందుల్లో కూరుకుపోతాం.
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
వృథాను అరికడితే పొదుపు చేసినట్టేనని పెద్ద లు చెబుతుంటారు. నిజమే ఆర్థిక పరిస్థితి బాగోని సమయంలో ఆ మాటను పక్కాగా పాటించకపోతే ఇంకా ఇబ్బందుల్లో కూరుకుపోతాం. గత వైసీపీ ప్రభుత్వం పోతూ పోతూ పెద్ద అప్పుల అగాథాన్ని కూటమి ప్రభుత్వానికి అప్పగించింది. కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టే నాటికి ఆర్థిక పరిస్థితి అతలాకుతలంగా ఉన్నా.. సంక్షోభాల నుంచే అవ కాశాలను సృష్టించుకోవాలని చెప్పడమే కాకుండా చేసిచూపించే సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థి కంగా గాడిలో పెట్టడానికి అహర్నిశలు శ్రమిస్తు న్నారు. ఈ క్రమంలో వృథా ఖర్చులు తగ్గించుకో వాలని, ఉన్నదాంట్లో సర్దుకొని పనిచేయాలని పదే పదే చెబుతూనే ఉన్నారు. కానీ జిల్లా యంత్రాంగా నికి మాత్రం ఆ మాటలు పెద్దగా చెవికెక్కడం లేదని ప్రభుత్వ కార్యాలయాలకు చెల్లిస్తున్న అద్దె లు చెబుతున్నాయి. శుభ్రం చేసి సున్నం వేసుకుం టే ఎంచక్కా విధులు నిర్వహించుకొనే అవకాశం ఉన్న భవనాలు కళ్ల ముందు కనబడుతున్నా కొన్ని శాఖల అధికారుల్లో మాత్రం విలాస భవంతి లేక పోతే కులాసాగా పని చేయమనే ధోరణి జనాన్ని విస్మయానికి గురిచేస్తోంది.
ఫ అద్దెల చెల్లింపే సౌఖ్యమట!
జిల్లాల విభజన తర్వాత ఉన్నపళంగా కొత్త ప్రాంతానికి ఫైల్సు సర్దుకొని వచ్చేయాల్సిన పరి స్థితి తెలిసిందే. దీంతో అందుబాటులో ఉన్న ప్రభు త్వ కార్యాలయాల్లో కార్యకలాపాలను ప్రారంభించా రు. బొమ్మూరులోని న్యాక్ భవనాన్ని కలెక్టరేట్‌కి కేటాయించారు. వాస్తవానికి ప్రజలు వెళ్లడానికి రవాణాపరంగా ఏమాత్రం అనుకూలంగా కలెక్టరే ట్ ఉండదు. కానీ తప్పని పరిస్థితుల్లో ఏర్పాటు చేయాల్సి వచ్చింది. జిల్లా స్థాయి కార్యాలయాలను కొన్నిటిని కలెక్టరేట్‌లో, మరికొన్నిటిని అక్కడికి కాస్త దగ్గరలోని వైటీసీ భవనంలో ఏర్పాటుచేశారు. జిల్లా స్థాయి అధికారుల చాంబర్లు కూడా ఇప్పటి కీ చిన్న గదుల్లోనే ఉన్నాయి. అసలు మరుగుదొడ్ల సదుపాయం సరిగా లేదు. ఒక్కసారి ఇంటి నుంచి ఆఫీసుకు వచ్చారంటే భోజనం తెచ్చుకున్నా లేక పోయినా మళ్లీ ఆఫీస్ సమయం అయ్యే వరకూ ఇంటికి వెళ్లే పరిస్థితి ఉండదు. అల్పాహారం తినాలన్నా తిప్పలే. హోటళ్లు ఎక్కడో దూరంగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో సైతం అధికారులు నెట్టుకొస్తున్నారు. కొందరు అధికారులు సొంత సొమ్ములతో కనీసం మౌలిక వసతులు ఏర్పాటు చేసుకున్నారు. ఒక జిల్లా అధికారి కార్యాలయం అయితే నిన్న మొన్నటి వరకూ మేజర్ డ్రైన్ పక్కనే ఉండేది. అయితే, కొందరు అధికారులు ఇలా సర్దుకుపోతుంటే.. మరి కొందరు అధికారులు మాత్రం అద్దె చెల్లించినా ఫర్యాలేదు.. సౌఖ్యాలు ఉండాల్సిందే అంటున్నారు.
ఫ భవనాలు అందుబాటులో ఉన్నా
జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరంలో ప్రభు త్వానికి చెందిన భవనాలు చాలా ఉన్నాయి. అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కొన్ని భవనాలకు సున్నంవేసి, శుభ్రం చేయించుకుంటే వినియోగిం చుకోవచ్చు. సెంట్రల్ జైలు ఎదురుగా ఆర్‌అండ్ బీకి చెందిన భవనాలు చాలా ఉన్నాయి. కంబాల చెరువు సమీపంలో దాదాపు పూర్తి కావొచ్చిన భవ నం ఉంది. ఫైర్ ఆఫీస్ పక్కన రైల్వేకి చెందిన భవనం శిథిలావస్థకు చేరుకుంటోంది. ఇవి ప్రజల రాకపోకలకు కూడా సౌకర్యవంతంగా ఉంటాయి. వీటికి స్పల్ప మొత్తంలో నిధులు కేటాయిస్తే లక్ష ల్లో ప్రజల సొమ్ము ఆదా అవుతుంది. కానీ అదేమీ కొందరు అధికారులకు పట్టడం లేదు. ఉదాహరణ కు ఎక్సైజ్ జిల్లా కార్యాయం దానవాయిపేటలోని ఓ భవనంలో ఏర్పాటుచేశారు. ఈ భవనానికి సుమారు రూ.40 వేలు అద్దె చెల్లిస్తున్నారు. ఎక్సైజ్ జిల్లా కార్యాలయానికి ప్రజల రాకపోకలు ఉండవు. కానీ వైటీసీలో కేటా యించిన మూడు గదులు కాదని.. నగరంలో ఓ విలాసవంతమైన భవంతిని అద్దెకు తీసుకు న్నారు. తక్కువ అద్దెకు దొరికే ప్రాంతాలు ఉన్నా హోదాకు తగినట్టుగా ఉండాలని రిచ్ ఏరియాని ఎంచుకొ న్నారు. అలాగే అర్బన్ తహశీల్దారు కార్యాలయం పక్కన రిజిస్ట్రేషన్ల శాఖకు సొంత భవనం ఉంది. దానిని పాడుబడిన భవనంగా చేయడంలో భాగంగా వదిలేసి అద్దె భవనంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 11 ఎస్‌ఆర్‌వో, 2 ఆర్‌వో కార్యాలయాలు ఉండగా 11 కార్యాలయాలకు అద్దెలు కడుతున్నారు. రాజమహేంద్ర వరంలోని రిజిస్ట్రారు కార్యాలయానికి ఏకంగా రూ.50 వేలు, జిల్లా రిజిస్ట్రారు కార్యాలయానికి రూ.24 వేలు అద్దెలుగా చెల్లిస్తున్నారు. జిల్లా మైన్స్ కార్యాలయం లాలాచెరువు సమీపంలోని ఓ భవనంలో ఉంది. దీనికి సుమారు రూ.50 వేలు అద్దె కడుతున్నారు. కానీ చాలా మటుకు అక్కడ ఒక అటెండర్ మాత్రమే దర్శనమిస్తారు. గదుల్లోని కుర్చీలన్నీ ఖాళీగా ఉంటాయి. అధికారులు కలెక్టరేట్ నుంచి పనిచేస్తుంటారు. ఈ విషయంలో అర్బన్ తహశీల్దారు కా ర్యాలయాన్ని మెచ్చుకొని తీరా ల్సిం దే. ఇది విధులు నిర్వర్తించడానికి ఏమాత్రమూ సదుపాయంగా ఉండదు. వర్షాకాలం వచ్చిందంటే పడవల్లో ఆఫీసుకు చేసుకొనే పరిస్థితి ఉంది. సీలింగ్ నుంచి వర్షం నీరు ధారాపాతంగా కారు తుంది. ఏళ్ల తరబడి ఆ కార్యాల యంతోనే వేగుతున్నారు.
ఫ లెక్కలు లేవు
జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, వాటి అనుబంధ శాఖలకు సంబంధించి 50 వరకూ కార్యాలయాలు ఉన్నాయి. వాటిలో చాలా మటుకు జిల్లా కలెక్టరేట్, వైటీసీ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కానీ కొన్ని శాఖల కార్యాలయాలు మాత్రం అద్దె భవనాల్లో ఉన్నాయి. ఎన్ని అద్దె భవనాల్లో ఉన్నాయి, వాటికి నెలకు ఎంత జనం సొమ్ము అద్దెలుగా చెల్లిస్తున్నారనే లెక్కలు స్పష్టంగా లేని పరిస్థితి ఉంది. ఏ శాఖకు చెందిన బడ్జెట్‌లో ఆ శాఖ చెల్లించు కుంటుందని, అందువల్ల జిల్లా కలెక్టరేట్‌లో కూడా వివరాలు ఉండవనే సమాధానం ఎదురవుతోంది. కలెక్టర్ ప్రశాంతి అద్దెల పేరుతో దుబారాపై దృష్టి సారించాలనే వాదన వినవస్తోంది. అందుబాటులో ఉన్న భవనాలను శిథిలాలకు వదిలేయకుండా బాగు చేయించి ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయిస్తే జనం సొమ్ము పెద్ద ఎత్తున ఆదా అయ్యే అవకాశం ఉంది.