Share News

క్రీడా సంబరం...

ABN , Publish Date - Dec 11 , 2025 | 12:13 AM

జేఎన్టీయూకే, డిసెంబరు 10 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యం లో అసోషియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్శిటీస్‌ (ఏఐయూ) సహకారంతో వర్శిటీ మైదానంలో సౌత్‌జోన్‌ అంతర విశ్వవిద్యాలయాల పురుషుల వాలీబాల్‌ పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జేఎన్టీ

క్రీడా సంబరం...
బెలూన్లు వదిలి పోటీలను ప్రారంభిస్తున్న అతిథులు

జేఎన్టీయూకేలో సౌత్‌జోన్‌ అంతర

విశ్వవిద్యాలయాల వాలీబాల్‌ పోటీలు

ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ విప్‌,

విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు

కాకినాడ జిల్లాలో 3చోట్ల టోర్నమెంట్‌

ఈ నెల 14 వరకూ నిర్వహణ

మొదటి రోజు 40 మ్యాచ్‌లు

జేఎన్టీయూకే, డిసెంబరు 10 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యం లో అసోషియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్శిటీస్‌ (ఏఐయూ) సహకారంతో వర్శిటీ మైదానంలో సౌత్‌జోన్‌ అంతర విశ్వవిద్యాలయాల పురుషుల వాలీబాల్‌ పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జేఎన్టీయూకే, సూరంపాలెంలోని ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాల, అచ్చంపేటలోని రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ సైన్సెస్‌ సంయుక్తంగా నిర్వహించే వాలీబాల్‌ టోర్నమెంట్‌ను ప్రభుత్వ విప్‌, విశాఖపట్నం పశ్చిమ ఎమ్మెల్యే, ఏపీ వాలీబాల్‌ సంఘ అధ్యక్షులు, వాలీబాల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఉపాధ్యక్షుడు పి.గణవెంకట రెడ్డినాయుడు(గణబాబు) ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. వర్శిటీ క్రీడా మైదానంలో ఉపకులపతి ప్రొఫెసర్‌ సీఎస్‌ఆర్కే ప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించిన టోర్నమెంట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత, మాజీ అంతర్జాతీయ వాలీబాల్‌ క్రీడాకారుడు పి.వెంకటరమణ, గౌరవ అతిథులుగా కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహ న్‌, ఏఎస్పీ మనీష్‌ దేవరాజ్‌ పాటిల్‌, ఏఐయూ పరిశీలకులు డాక్టర్‌ ఈ.త్రిమూర్తులు హాజరయ్యా రు. ఈనెల 14 వరకూ జరిగే ఈ టోర్నమెంట్‌లో సుమారుగా 138 జట్లు పాల్గొంటున్నాయి. పోటీలను 4పూల్స్‌గా విభజించారు. పూల్‌ ఏ, బీ పోటీ లు జేఎన్టీయూకే మైదానంలో, పూల్‌ సీ పోటీలు అచ్చంపేటలోని రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ క్యాంపస్‌లో, పూల్‌ డీ లోని జట్లకు సంబంధించిన పోటీలు సూరంపాలెంలో ని ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాలలో జరుగుతున్నాయి. జ్యోతి ప్రజ్వలన అనంతరం అతిథులు జాతీ య జెండాను, క్రీడాపతాకాన్ని ఆవిష్కరించి పోటీ ల్లో పాల్గొంటున్న జట్ల క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

ఉత్తమ ప్రతిభ కనబరచాలి...

కాకినాడ కలెక్టర్‌ షాన్‌మోహన్‌ మాట్లాడుతూ క్రీడాకారులకు అభినందనలు తెలిపి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. కాకినాడ జిల్లాలో ఎంతో సుందరమైన టూరిస్టు ప్రదేశాలు ఉన్నాయని తెలిపారు. ఏఎస్పీ మాట్లాడు తూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఎమ్మెల్సీ మా ట్లాడుతూ క్రీడాకారులు తమపై తాము నమ్మకం ఉంచుకుని బాగా రాణించినపుడే విజయం సా ధించవచ్చని తెలిపారు. వీసీ మాట్లాడుతూ కాకినాడ జేఎన్టీయూకే వాలీబాల్‌ టోర్నమెంట్‌ నిర్వహణ బాధ్యతలను అప్పగించిన ఏఐయూకు కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాకారులు, అధికారులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. టోర్నమెంట్‌లో మొదటిరోజు 40మ్యాచ్‌లు జరిగాయని తెలిపారు. కార్యక్రమం లో రెక్టార్‌ సుబ్బారావు, రిజిస్ట్రార్‌ ఆర్‌.శ్రీనివాసరావు, ఓఎస్‌డీ కోటేశ్వరరావు, వర్శిటీ స్పోర్ట్ప్‌ కౌన్సిల్‌ కార్యదర్శి, టోర్నమెంట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ జి.శ్యామ్‌కుమార్‌, కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్‌ జీపీరాజు, ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్‌ పి.ఉదయభాస్కర్‌, మాజీ వీసీలు ప్రసాదరాజు, పద్మరాజు డైరెక్టర్లు కృష్ణమోహన్‌, బీటీ కృష్ణ, ప్రిన్సిపాల్‌ మోహన్‌రావు, పీడీలు వెంకటేశ్వరరావు ఉన్నారు.

క్రమశిక్షణ అవసరం...

ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తితో ఆడి ఉత్తమ ప్రతిభ చూపాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల నుం చి వచ్చిన క్రీడాకారులు, జట్ల మేనేజర్లకు ఎటు వంటి ఇబ్బందులు లేకుండా జేఎన్టీయూకే ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు కల్పించడం జ రిగిందన్నారు. క్రీడాకారులకు క్రమశిక్షణ ఎంతో అవసరమని దీని ద్వారా చదువులోనూ, క్రీడల్లోనూ రాణించగలరని తెలిపారు. వెంకటరమణ మాట్లాడుతూ వాలీబాల్‌ క్రీడాకారులు కష్టపడి ఆడుతూ క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. అంతేకాకుండా కష్టపడి ఆ డినవారు ఎప్పటికైనా విజయం సాధిస్తారన్నారు.

Updated Date - Dec 11 , 2025 | 12:13 AM