Share News

ప్రకృతితో కలిసి నడిస్తే ఎన్నో విజయాలు!

ABN , Publish Date - Sep 08 , 2025 | 12:25 AM

ప్రకృతి నుంచి మానవుడు ఎన్నో నేర్చుకున్నాడని, ప్రకృతితో కలిసి నడిచే మానవ పరిణామ క్రమంలో ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నాడని మాజీ ఎంపీ మిడియం బాబూరావు అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని యూటీఎఫ్‌ హోంలో జన విజ్ఞాన వేదిక జిల్లా సభ జరిగింది.

ప్రకృతితో కలిసి నడిస్తే ఎన్నో విజయాలు!
సభలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ బాబూరావు

  • జన విజ్ఞాన వేదిక జిల్లా సభలో వక్తలు

రాజమహేంద్రవరం అర్బన్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి నుంచి మానవుడు ఎన్నో నేర్చుకున్నాడని, ప్రకృతితో కలిసి నడిచే మానవ పరిణామ క్రమంలో ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నాడని మాజీ ఎంపీ మిడియం బాబూరావు అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని యూటీఎఫ్‌ హోంలో జన విజ్ఞాన వేదిక జిల్లా సభ జరిగింది. ఈ సభలో వక్తలు ప్రకృతి-సమాజం-సైన్సు అనే అంశంపై ప్రసంగించారు. బాబూరావు మాట్లాడుతూ ప్రస్తుతం అభివృద్ధి పేరుతో ప్రకృతి విధ్వంసం జరుగుతోందని, ఇది మానవ మనుగడకు ప్రమాదకరమన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి మాట్లాడుతూ ప్రజల్లో మూఢ నమ్మకాలు పారదోలి శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించడానికి జనవిజ్ఞాన వేదిక మరింత క్రియాశీలకంగా పనిచేయాలన్నారు. సభకు అధ్యక్షుడు కె.భీమయ్య అధ్యక్షత వహించారు. రాష్ట్ర కార్యదర్శి కేఎంఎంఆర్‌ ప్రసాద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.రవిబాబు మాట్లాడారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా భీమయ్య, ప్రధాన కార్యదర్శిగా రవిబాబు, కోశాధికారిగా జి.తాతారావు, ఇతర కార్యవర్గం ఎన్నికైంది.

Updated Date - Sep 08 , 2025 | 12:25 AM