3 గంటల పాటు రాజమండ్రిలో వివేక్ ఎక్స్‌ప్రెస్
ABN , Publish Date - May 16 , 2025 | 12:48 AM
రాజమహేంద్రవరం, మే 15 (ఆంధ్ర జ్యోతి): డుమ్రిఘర్ నుంచి కన్యాకుమారి వెళ్తున్న ట్రైన్ నెంబర్ 22503 వివేక్ ఎక్స్‌ప్రెస్ మర మ్మతులకు గురికావడంతో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి స్టేషన్‌లో 3 గం టల పాటు నిలిపివేశారు. ఇది భారతదే శం లో అతి ఎక్కువ రోజులు ప్రయాణించే రైలు. ఈ రైలు గురువారం రాత్రి 8:5
ఊడిన ఏసీ బోగీ యాక్సిల్ బాక్స్ రింగ్ కవర్
గుర్తించి నిలిపివేసిన టీఎక్స్‌ఆర్ సిబ్బంది
రాజమహేంద్రవరం, మే 15 (ఆంధ్ర జ్యోతి): డుమ్రిఘర్ నుంచి కన్యాకుమారి వెళ్తున్న ట్రైన్ నెంబర్ 22503 వివేక్ ఎక్స్‌ప్రెస్ మర మ్మతులకు గురికావడంతో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి స్టేషన్‌లో 3 గం టల పాటు నిలిపివేశారు. ఇది భారతదే శం లో అతి ఎక్కువ రోజులు ప్రయాణించే రైలు. ఈ రైలు గురువారం రాత్రి 8:50 గంటలకు రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ మూడో ప్లాట్‌పాంకు చేరుకునే సమయంలో ఇంజన్ నుంచి 14వ బోగీ అయిన బీ1 ఏసీ బోగీ యాక్సిల్ బాక్స్ రింగ్‌కు ఉండే కవర్ ఊడిపో యి, బోల్టులు కూడా ఊడిపోతుండగా టీఎక్స్ ఆర్ సిబ్బంది గుర్తించారు. అయితే కవర్ మార్చే ఏర్పాట్లు లేకపోవడంతో బీ1 బోగీని రాజమండ్రి స్టేషన్‌లో వదిలేసి మిగతా రైలును 11:50 ప్రాంతంలో పంపించారు. బీ1 బోగీలోని ప్రయాణికులను వేరే బోగీలో సర్దు బాటు చేశారు. విశాఖలో మరొక బోగీని లిం క్ చేస్తామని అధికారులు తెలిపారు. ఎస్ ఎ ంఆర్ రంగనాథ్, చీఫ్ కమర్షియల్ ఇన్ స్పె క్టర్ కల్యాణ్ కుమార్ మరమ్మతులను పర్య వేక్షించారు. ఆర్‌పీఎఫ్ సిబ్బంది బందో బస్తు నిర్వహించారు. విషయం గుర్తించక పోతే రై లు పట్టాలు తప్పి పెను ప్రమాదమే కలిగేది.